2024 Independence Day Tollywood Boxoffice : టాలీవుడ్ ఫస్టాఫ్‌లో ఆశించినంత రేంజ్లో సినిమాలేమీ హిట్ అందుకోలేదు. పక్కా మాస్ సినిమాగా వచ్చిన మహేశ్ గుంటూరు కారం మిక్స్డ్ టాక్‌తో ముగించేసింది. కేవలం హనుమాన్, టిల్లు స్క్వేర్ మాత్రమే మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక సకెండాఫ్ ప్రారంభంలో(జూన్ చివర్లో) వచ్చిన కల్కి సెన్సేషనల్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ నెక్ట్స్ టార్గెట్ ఇండిపెండెన్స్ డే.
అయితే ఇప్పుడు ఈ పంద్రాగస్ట్న బాక్సాఫీస్ ముందు మాస్ జాతర కనిపించనుంది. వాస్తవానికి ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ముందుగా పుష్ప - 2, భారతీయుడు 2 కర్చీఫ్‌లు వేశాయి. దీంతో బాక్సాఫీస్ షేకే అని అంతా ఆశించారు. కానీ ప్లాన్ మారింది. భారతీయుడు 2 ముందుగానే విడుదలై డిజాస్టర్ అవ్వగా, పుష్ప 2 డిసెంబర్‌కు వాయిదా పడింది.
దీంతో ఇప్పుడు ఇండిపెండెన్స్ డే రోజున కొత్త చిత్రాలు కర్చీఫ్‌లు వేశాయి. ఉస్తాద్ రామ్ - పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15కు(Double Ismart Release Date) షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రం ఎంత మాస్‌గా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మాస్‌ను ఒక ఊపు ఊపేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడు సీక్వెల్‌పై కూడా మాస్ వర్గం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.