12th Fail Hero National Award :హిందీతో పాటు రిలీజైన అన్ని భాషల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన '12th ఫెయిల్' మూవీ ఇప్పటికే ఎన్నో అవార్డులను, రికార్డులను సొంతం చేసుకుంది. ఇందులో భాగంగానే ఈ సినిమా జాతీయ అవార్డుల బరిలోనూ నిలిచింది. కానీ ఇందులో హీరో విక్రాంత్ మస్సేకు జాతీయ అవార్డు వస్తుందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు తెగ ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ విషయంపై హీరో విక్రాంత్ స్పందించారు.
"మా సినిమా నేషనల్ అవార్డుల నామినేషన్స్‌లో ఎంపికవ్వడం మా టీమ్‌కు ఎంతో సంతోషానిచ్చింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ఎన్నో ప్రశంసలు కూడా అందుకుంది. ఎన్నో గొప్ప వేదికల్లోనూ ఈ సినిమా గురించి ప్రస్తావించారు. నా యాక్టింగ్ కూడా మంచి గుర్తింపు లభించింది. అందుకు నేను ఎంతో ఆనందంగానూ ఉన్నాను. అయితే నాకు జాతీయ అవార్డు వస్తుందంటూ రూమర్స్ వచ్చినట్లు తెలుసుకున్నాను. ఈ సిినిమాలో నటించేందుకు నేను ఎంతో కష్టపడ్డాను. అయితే ఈ ఏడాది ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆడియెన్స్‌ను అలరించాయి. 'ది గోట్ లైఫ్', 'ఆవేశం' లాంటి సినిమాల్లో స్టార్‌ల నటన అద్భుతం. వారి సరసన ఉండటాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. నేషనల్ అవార్డు వస్తుందా రాదా అన్న దానిగురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం కాదు" అని విక్రాంత్ అన్నారు.