తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

పంజాబ్​ నేషనల్ బ్యాంక్​లో 1025 'SO' పోస్టులు - దరఖాస్తుకు మరో 5 రోజులే ఛాన్స్​! - Banking jobs 2024

PNB Specialist Office Jobs 2024 : బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. పంజాబ్ నేషనల్ బ్యాంక్​ 1025 స్పెషలిస్ట్ ఆఫీసర్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

Punjab National Bank Recruitment 2024
PNB Specialist Office Jobs 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 10:22 AM IST

PNB Specialist Office Jobs 2024 : పంజాబ్​ నేషనల్ బ్యాంక్​ 1025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో క్రెడిట్ ఆఫీసర్, ఫారెక్స్ మేనేజర్​, సైబర్ సెక్యూరిటీ మేనేజర్​, సీనియర్ మేనేజర్​ మొదలైన పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగాల వివరాలు

  • క్రెడిట్ ఆఫీసర్ - 1000 పోస్టులు
  • ఫారెక్స్ మేనేజర్​ - 15 పోస్టులు
  • సైబర్ సెక్యూరిటీ మేనేజర్ (MMG) - 5 పోస్టులు
  • సైబర్ సెక్యూరిటీ సీనియర్ మేనేజర్ - 5 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 1025

విద్యార్హతలు

  • క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు - కనీసం 60 శాతం మార్కులతో సీఏ/ సీఎంఏ/ సీఎఫ్​ఏ/ ఎంబీఏ/ పీజీడీఎం ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • ఫారెక్స్ మేనేజర్ - కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ/ పీజీడీఎం క్వాలిఫై అయ్యుండాలి.
  • సైబర్ సెక్యూరిటీ మేనేజర్ - ​ కంప్యూటర్​ సైన్స్​/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీల్లో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. లేదా ఎంసీఏ చేసి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.

వయోపరిమితి

  • క్రెడిట్ ఆఫీసర్ : 21 ఏళ్లు - 28 ఏళ్లు
  • ఫారెక్స్ మేనేజర్​ : 25 ఏళ్లు - 35 ఏళ్లు
  • సైబర్ సెక్యూరిటీ మేనేజర్ (MMG) : 25 ఏళ్లు - 35 ఏళ్లు
  • సైబర్ సెక్యూరిటీ సీనియర్ మేనేజర్ : 27 ఏళ్లు - 38 ఏళ్లు

దరఖాస్తు రుసుము

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1000 + జీఎస్టీ చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు దరఖాస్తు రుసుముగా రూ.50 + జీఎస్టీ చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులకు ముందుగా ఆన్​లైన్ ఎగ్జామ్ పెడతారు. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు

  • క్రెడిట్ ఆఫీసర్​లకు నెలకు రూ.36,00 నుంచి రూ.63,840 వరకు జీతం ఇస్తారు.
  • ఫారెక్స్ మేనేజర్​లకు నెలకు రూ.48,173 నుంచి రూ.69,810 వరకు సాలరీ అందిస్తారు.
  • సైబర్ సెక్యూరిటీ మేనేజర్​ (MMG)లకు నెలకు రూ.48,173 నుంచి రూ.69,810 వరకు సాలరీ ఇస్తారు.
  • సైబర్ సెక్యూరిటీ సీనియర్ మేనేజర్​లకు నెలకు రూ.63,840 నుంచి రూ.78,230 వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ముందుగా పంజాబ్​ నేషనల్ బ్యాంక్ అధికారిక వెబ్​సైట్ https://www.pnbindia.in/ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజ్​లోని కెరీర్స్ సెక్షన్​ని క్లిక్ చేయాలి.
  • PNB SO Apply లింక్​పై క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • మీ ఫొటో, స్కాన్ చేసిన సిగ్నేచర్​ సహా అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2024 ఫిబ్రవరి 3
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ :2024 ఫిబ్రవరి 25
  • పరీక్ష తేదీ : 2024 మార్చి/ ఏప్రిల్​

SBIలో 131 'స్పెషలిస్ట్' ఉద్యోగాలు- అప్లై చేసుకోండిలా!

ఇంజినీరింగ్ అర్హతతో 1425 అప్రెంటీస్​ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details