NPCIL Recruitment 2024 : ముంబయిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) 58 అసిస్టెంట్ (గ్రేడ్-1) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
- అసిస్టెంట్ గ్రేడ్-1 (HR) : 29 పోస్టులు
- అసిస్టెంట్ గ్రేడ్-1 (F&A) : 17 పోస్టులు
- అసిస్టెంట్ గ్రేడ్-1 (C&MM) : 12 పోస్టులు
- మొత్తం పోస్టులు : 58
విద్యార్హతలు
NPCIL Assistant Job Qualifications :అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి
NPCIL Assistant Age Limit :అభ్యర్థుల వయస్సు 2024 జూన్ 25 నాటికి 21 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఓబీసీ, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
NPCIL Assistant Job Application Fee :
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి.
- మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.
పే స్కేల్
NPCIL Assistant Salary :అసిసెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,500 నుంచి రూ.38,250 వరకు జీతం ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
NPCIL Assistant Selection Process :
- రాత పరీక్ష
- టైప్ రైటింగ్ టెస్ట్
- కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
దరఖాస్తు విధానం
NPCIL Assistant Selection Process :
- అభ్యర్థులు ముందుగా NPCIL అధికారిక వెబ్సైట్ https://www.npcilcareers.co.in/ ఓపెన్ చేయాలి.
- Careers విభాగంలోకి వెళ్లి Apply Online లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
- వెంటనే మీకొక రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
- ఈ ఐడీ, పాస్‌వర్డ్‌లతో వెబ్సైట్లోకి లాగిన్ కావాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- ముఖ్యమైన పత్రాలు అన్నీ అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తు రుసుము కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 జూన్ 5
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జూన్ 25
BSF రిక్రూట్మెంట్ - 1526 ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - BSF Recruitment 2024
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 9,995 పోస్టులతో IBPS భారీ నోటిఫికేషన్ - దరఖాస్తు చేసుకోండిలా! - IBPS Recruitment 2024