EPFO Jobs 2024 : కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేయాలనే ఆశావహులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో మొత్తం 335 ఉద్యోగాల నియమకానికి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ). ఆసక్తి ఉండి అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు
EPFO Vacancies 2024 :335 పోస్టులు.
పోస్టు పేరు
EPFO PA Jobs 2024 :పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)
విద్యార్హతలు
EPFO Jobs 2024 Eligibility :ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీంతో పాటు స్టెనోగ్రఫీ, టైపింగ్‌లో నైపుణ్యం ఉండాలి.
ఏజ్ లిమిట్ (2024 ఆగస్టు 1నాటికి)
EPFO Jobs 2024 Age Limit :పీఏ పోస్టుకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి.
వయోపరిమితి సడలింపులు
EPFO Jobs 2024 Age Relaxation :
- ఓబీసీ- 3 ఏళ్లు
- ఎస్సీ, ఎస్టీ- 5 ఏళ్లు
- దివ్యాంగులకు- 10 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ
EPFO Jobs 2024 Selection Process :
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్
అప్లికేషన్ ఫీజు
EPFO Jobs 2024 Application Fees :
- అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.100ను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అంటే పూర్తి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
EPFO Jobs 2024 Important Dates :
- దరఖాస్తు ప్రారంభ తేదీ- 2024 మార్చి 7
- దరఖాస్తుకు ఆఖరు తేదీ- 2024 మార్చి 27
- కరెక్షన్స్‌కు ఛాన్స్- దరఖాస్తు ఫారమ్‌లో ఏవైనా తప్పులు దొర్లితే 2024 మార్చి 28 నుంచి ఏప్రిల్ 3 వరకు ఎడిట్ చేసుకోవచ్చు.
- పరీక్షా తేదీ- ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో పరీక్షను నిర్వహిస్తారు.
కేటగిరీల వారిగా పోస్టుల వివరాలు
EPFO Jobs 2024 Category Wise :
- అన్రిజర్వ్డ్- 132
- ఎస్సీ- 48
- ఎస్టీ- 24
- ఓబీసీ- 87
- ఈడబ్ల్యూఎస్- 32
- దివ్యాంగులు- 12
జాబ్ లొకేషన్
EPFO Vacancy Job Location :ఉద్యోగానికి ఎంపికైనా వారికి దేశ వ్యాప్తంగా ఉన్న ఈపీఎఫ్ఓ కార్యాలయాల్లో పోస్టింగ్ కల్పిస్తారు.
ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్
EPFO Official Website :నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://upsconline.nic.in/ ను చూడవచ్చు.
SSC భారీ నోటిఫికేషన్ - 2049 పోస్టుల భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా!
ఇంజినీరింగ్ అర్హతతో SAILలో 314 ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా!