Best Freelancing Sites In India : ఎవరిపైనా ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడాలని చాలా మందికి ఉంటుంది. అందుకే సెల్ఫ్-ఎంప్లాయ్మెంట్ జాబ్స్ చేయాలని భావిస్తూ ఉంటారు. ఇలాంటి వారు తమ వీలును బట్టి ఫ్రీలాన్సింగ్ చేసి, మంచిగా డబ్బులు సంపాదించవచ్చు.
ఉన్నత విద్య చదువుకుని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే చాలా మంది, ఇలా ఫ్రీలాన్సింగ్ చేసి, తమ నిత్యావసరాలకు సరిపడా డబ్బులు సంపాదిస్తున్నారు. మరికొందరు పూర్తిగా ఫ్రీలాన్సింగ్ చేస్తూనే భారీగా డబ్బులు సంపాదించి, జీవితంలో స్థిరపడుతున్నారు. మరి మీరు కూడా ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం మార్కెట్లో మంచి రెప్యుటేషన్ ఉన్న టాప్-10 ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ల వివరాలు మీ కోసం.
1. Freelancer :అంతర్జాతీయంగా మంచి రెప్యుటేషన్ ఉన్న ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో దాదాపు 247 దేశాలకు చెందిన 40 లక్షల మందికి పైగా ఫ్రీలాన్సర్లు ఉన్నాయి. ఈ వెబ్సైట్లో మీకు చాలా రకాల ప్రాజెక్టులు దొరుకుతాయి. అవేంటి అంటే?
- సాఫ్ట్వేర్ డెవలప్మెంట్
- ఫ్రీలాన్స్ రైటింగ్
- డాటా ఎంట్రీ
- డిజైనింగ్
- సేల్స్ అండ్ మార్కెటింగ్
- అకౌంటింగ్ అండ్ లీగల్ సర్వీసెస్
2. Truelancer : ఈ వెబ్సైట్లో ప్రీమియం సర్వీసులు మాత్రమే లభిస్తాయి. అంటే హైలీ ప్రొఫెషనల్ ఫ్రీలాన్సర్లు మాత్రమే ఇందులో ప్రాజెక్టులు సంపాదించగలరు. పేమెంట్స్ కూడా బాగానే ఉంటాయి. ఈ వెబ్సైట్లో ఎవరెవరికి ప్రాజెక్టులు లభిస్తాయంటే?
- స్కిల్డ్ డెవలపర్స్
- డిజైన్ & క్రియేటివ్స్
- బ్లాగర్స్ & రైటర్స్
- ఎస్ఈఓ ఎక్స్పర్ట్స్
- సేల్స్ & మార్కెటింగ్
- మొబైల్ యాప్ డెవలపర్స్
3. Upwork : ఈ వెబ్సైట్లో త్వరగా ఫ్రీలాన్సింగ్ జాబ్స్ లభిస్తుంటాయి. మీరు ఒక జాబ్ గురించి పోస్ట్ చేయగానే, 24 గంటల్లో మీకు అనేక ప్రపోజల్స్ వస్తాయి. ఈ వెబ్సైట్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే?
- వెబ్, మొబైల్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్
- డిజైన్ అండ్ క్రియేటివిటీ
- కంటెంట్ రైటింగ్/ ఫ్రీలాన్సింగ్ రైటింగ్
- సేల్స్ అండ్ మార్కెటింగ్
- డాటా సైన్స్ అండ్ అనాలసిస్
- ఇంజినీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్
- కస్టమర్ సర్వీస్
- అడ్మిన్ సపోర్ట్
4. 99Designs : కస్టమ్ డిజైన్లు చేయాలని అనుకునేవారికి ఈ 99డిజైన్స్ అనేది మంచి ప్లాట్‌ఫాం అవుతుంది. ఈ వెబ్సైట్లో ఎలాంటి ప్రాజెక్టులు ఉంటాయంటే?
- వెబ్సైట్ బిల్డింగ్
- వెబ్ పేజ్ డిజైన్
- వర్డ్‌ప్రెస్ థీమ్ డిజైన్
- ఇల్లస్ట్రేషన్ అండ్ గ్రాఫిక్స్
- లాండింగ్ పేజ్ డిజైన్ (క్లిక్స్)
- యాప్ డిజైన్
- ప్రొడక్ట్ ప్యాకేజింగ్
- ప్రొడక్ట్ లేబులింగ్
- పోస్ట్‌కార్డ్స్, ఫ్లయర్స్ అండ్ ప్రింట్
- పోస్టర్స్
- ఈ-మెయిల్ మార్కెటింగ్ టెంప్లెట్స్
- బుక్ కవర్స్
- సోషల్ మీడియా పేజెస్
- లోగో అండ్ బ్రాండ్ ఐడెంటిటీ ప్యాకేజ్
5. Freelance India : మీకు కనుక మంచి నైపుణ్యాలు ఉంటే, ఈ ఇవాంటో స్టూడియోలో మంచి జాబ్ ఆపర్చూనిటీస్ లభిస్తాయి. ఈ వెబ్సైట్లో ఉండే ప్రాజెక్టులు ఏమిటంటే?
- మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్
- బ్రాడ్‌కాస్టింగ్, సినిమా, టెలివిజన్, మ్యూజిక్
- బిజినెస్ డెవలప్మెంట్
- డొమెస్టిక్ సర్వీసెస్
- హెల్త్ కేర్
- ఇల్లస్ట్రేషన్ అండ్ గ్రాఫిక్స్
- ఫొటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ
- సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్
- ఇంటీరియర్ డిజైన్ అండ్ ఫ్యాషన్ డిజైన్
- వెబ్ డిజైన్
- డేటా ఎంట్రీ
- ట్యూటరింగ్ అండ్ కోచింగ్ క్లాసెస్
6. Toptal : స్టార్టప్‌లు, బిజినెస్ ఆర్గనైజేషన్లు ఈ వెబ్సైట్లో పెద్దపెద్ద ప్రాజెక్టులను పోస్ట్ చేస్తుంటాయి. వీటిని నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. పైగా డబ్బులు కూడా బాగా వస్తాయి. ఈ వెబ్సైట్లో ఎలాంటి వారికి ప్రాజెక్టులు వస్తాయంటే?
- సాఫ్ట్వేర్ డెవలపర్
- డిజైనర్స్
- ఆర్కిటెక్ట్స్
- ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్
- ప్రాజెక్ట్ మేనేజర్స్
- ప్రొడక్ట్ మేనేజర్స్