తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకులు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా రుణం ఇవ్వడం లేదా? ఇలా చేస్తే లోన్ గ్యారెంటీ! - HOW TO GET BANK LOAN EASELY

బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్​ను రిజెక్ట్ చేస్తున్నాయా? డోంట్ వర్రీ - ఇలా చేస్తే రుణం మంజూరు చేయడం పక్కా!

Personal Loan
Personal Loan (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2024, 10:20 PM IST

How To Get Bank Loan Easely :ఏదైనా అవసరం పడినప్పుడు మనం అప్పులు చేస్తుంటాం. అలాంటి సందర్భాల్లో పరిచయస్తుల నుంచి, బ్యాంకుల ద్వారా లోన్స్ తీసుకుంటుంటాం. పరిచయస్తుల నుంచి అప్పు చేయడం ఈజీయే కానీ, బ్యాంకుల నుంచి లోన్స్ పొందడం అంత ఈజీ కాదు. ఎందుకంటే లోన్‌ను మంజూరు చేసే ముందు చాలా అంశాలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. వాటి ప్రకారం, మనకు తగిన అర్హతలు, ఆర్థిక స్థితిగతులు, ఆదాయం లేకుంటే లోన్ అప్లికేషన్‌ను బ్యాంకులు తిరస్కరిస్తాయి. ఇలాంటి తిరస్కరణను ఎదుర్కొన్నప్పుడు మనం అలర్ట్ కావాలి. లోన్ ఎందుకు మంజూరు కాలేదో తెలుసుకొని, భవిష్యత్తులో అలాంటి రెజెక్షన్ ఎదురుకాకుండా ట్రాక్ రికార్డును ప్రిపేర్ చేసుకోవడంపై ఫోకస్ చేయాలి.

ఆ దశలన్నీ దాటాల్సిందే!
ఇంతకు ముందు మనం లోన్ కోసం బ్యాంకుకు అప్లై చేశాక, దరఖాస్తును తనిఖీ చేసే ప్రక్రియ మ్యానువల్‌గా జరిగేది. ఇందుకు చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడే ఏఐ టెక్నాలజీని చాలా బ్యాంకులు వాడుతున్నాయి. లోన్ అప్లికేషన్‌ను ఏఐ సాఫ్ట్‌వేర్ పరిశీలించి, బ్యాంకు నిర్దేశించిన ప్రమాణాలకు తగిన అర్హతలు మనకు ఉన్నాయా? లేదా? అనేది తేలుస్తుంది. ప్రధానంగా క్రెడిట్ స్కోరు ఎంత ఉందనేది చూస్తుంది. మనకు తగిన అర్హతలున్నాయని తేలితేనే, సంబంధిత బ్యాంకు అధికారుల దగ్గరకు లోన్ అప్లికేషన్ చేరుతుంది. వారు దాన్ని చెక్ చేసి, ఫీల్డ్ విజిట్ చేయిస్తారు. మన వ్యాపారం లేదా ఉద్యోగం గురించి వివరాలు తెలుసుకుంటారు. బ్యాంకు స్టేట్​మెంట్లు, సాలరీ స్లిప్​లు, ఇతర ఆధారాలను తీసుకుంటారు. వాటిని విశ్లేషించి మన ఆదాయం స్థాయి, ఇప్పటికే ఉన్న అప్పులు, సిబిల్ స్కోర్ ఆధారంగా ఎంత వరకు లోన్ మంజూరు చేయాలనేది బ్యాంకు నిర్ణయిస్తుంది.

ఈ కారణాల వల్లే తిరస్కరణ!
ఇప్పటికే బ్యాంకు లోన్స్, క్రెడిట్ కార్డ్​ బకాయిలు ఉన్నవారికి మళ్లీ రుణాలు మంజూరయ్యే అవకాశాలు చాలా తక్కువ. పాత అప్పుల బకాయిలను చెల్లించడానికే ఆదాయం సరిపోతుందనే ఉద్దేశంతో, కొత్తగా లోన్స్ మంజూరు చేసేందుకు బ్యాంకులు ముందుకురావు. ఇప్పటికే ఉన్న అప్పుల ఈఎంఐలు ఆలస్యంగా చెల్లిస్తున్న వారికి కూడా లోన్స్ మంజూరులో ప్రయారిటీ లభించదు. తరుచుగా బ్యాంకు లోన్స్‌కు, క్రెడిట్ కార్డులకు అప్లై చేసే వారి లోన్ అప్లికేషన్లు కూడా రిజెక్షన్‌కు గురవుతుంటాయి. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నవారికి సైతం లోన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పదేపదే ఉద్యోగాలు మారే వారికి, ఆస్తుల విషయంలో కోర్టు కేసులు నడుస్తున్నవారికి, తాకట్టు పెట్టిన ఆస్తులపై చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్న వారికి కొత్త లోన్లను బ్యాంకులు మంజూరు చేయవు.

లోన్ రాకపోతే - ఇలా చేయండి!
సిబిల్ వంటి వివిధ క్రెడిట్ బ్యూరోలు ఇచ్చే వార్షిక నివేదికల ఆధారంగా, మన ఆర్థిక క్రమశిక్షణ ఏ రేంజులో ఉందనే దానిపై ఒక అంచనాకు రావచ్చు. ఇలాంటి సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటేనే, మనం క్రెడిట్ రికార్డును సరిదిద్దుకునే దిశగా ప్లానింగ్ రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నందువల్లే మీకు లోన్ మంజూరు కాలేదని తెలిస్తే, దాన్ని పెంచుకునేందుకు రెడీ కావాలి. మిగిలిన అప్పులను పూర్తిగా చెల్లించేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల క్రెడిట్ స్కోరు క్రమంగా పెరుగుతుంది. అప్పులు తీసుకోవడాన్ని వీలైనంత వరకు తగ్గించండి. మీకు క్రెడిట్‌ కార్డ్స్ ఉంటే, వాటి లిమిట్‌లో 30 శాతానికి మించి వాడకండి. బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం, బ్యాంకు నుంచి సాలరీ అడ్వాన్స్ తీసుకోవడం వంటి మార్గాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోండి.

ఎలాంటి గొడవలు లేకుండా ఆస్తులు పంచిపెట్టాలా? వీలునామా రాయండిలా! - How To Prepare Will Deed

మీ జీవిత బీమా పాలసీని సరెండర్‌ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! - Life Insurance Policy Surrender

ABOUT THE AUTHOR

...view details