What Is RBI Retail Direct Scheme :రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2020లో రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లకు నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీలు, సావరిన్ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేసే వీలు కల్పించింది. ఈ స్కీమ్ గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రభుత్వ సెక్యూరిటీలు
ప్రభుత్వాలు పబ్లిక్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించేందుకు 'గవర్నమెంట్ సెక్యూరిటీలు' (G-Secs) జారీ చేస్తుంటాయి. ఈ సెక్యూరిటీలు గవర్నమెంట్ ప్రామిసరీ నోట్స్, బేరర్ బాండ్స్ లాంటి వివిధ రూపాల్లో ఉంటాయి. వీటిని నేరుగా ప్రభుత్వమే జారీ చేస్తుందని కనుక మీ పెట్టుబడికి, రాబడికి గ్యారెంటీ ఉంటుంది.
ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ఉద్దేశ్యం
RBI Retail Direct Scheme Purpose :ఈ ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ప్రాథమిక లక్ష్యం మార్కెట్లో రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం. గతంలో సంస్థాగత పెట్టుబడిదారులు మాత్రమే గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్‌పై పూర్తిగా ఆధిపత్యం చెలాయించేవారు. దీనితో రిటైల్ పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీలు కొనుగోలు చేసే అవకాశం బాగా పరిమితం అయిపోయేది. ఈ పరిస్థితిని మార్చడానికే ఆర్బీఐ రిటైల్ డెరెక్ట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. భిన్నమైన పెట్టుబడిదారులను ఆకర్షించడం, మార్కెట్ లిక్విడిటీని పెంచడం, ప్రభుత్వ బాండ్లకు ఉన్న డిమాండ్‌ను మెరుగుపరడమే దీని ప్రధాన లక్ష్యం.
ఈ ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ ప్లాట్‌ఫామ్ ద్వారా, పెట్టుబడిదారులు భారత ప్రభుత్వ ట్రజరీ బిల్లులు, డేటెడ్ సెక్యూరిటీలు, స్టేట్ డెవలప్‌మెంట్ లోన్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్‌లతో సహా వివిధ ప్రభుత్వ సెక్యూరిటీలకు కొనుగోలు చేయవచ్చు.
ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ప్రయోజనాలు
RBI Retail Direct Scheme Benefits :ఈ ఆర్బీఐరిటైల్ డైరెక్ట్ స్కీమ్ పెట్టుబడిదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా ప్రైమరీ ఇష్యూయెన్సీలో పోటీ లేని బిడ్స్ వేయవచ్చు. సెకండరీ మార్కెట్లలో నేరుగా సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. అంతేకాదు పెట్టుబడిదారులకు చెందాల్సిన వడ్డీలు, మెచ్యూరిటీ అమౌంట్లు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోనే జమ అయిపోతాయి.
రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌లో చేరడానికి అర్హతలు
Eligibility Criteria For Retail Direct Scheme :ఈ ఆర్బీఐరిటైల్ డైరెక్ట్ స్కీమ్‌లో చేరాలంటే నిర్దేశిత అర్హతలు ఉండాలి. ముఖ్యంగా ఇండియాలో రూపీ సేవింగ్స్ ఖాతా ఉండాలి. పాన్ నంబర్, కేవైసీ డాక్యుమెంట్స్ ఉండాలి. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, 1999 కింద అర్హత కలిగిన నాన్-రెసిడెంట్ రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఈ స్కీమ్‌లో చేరవచ్చు.
ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ ఖాతా ఓపెన్ చేయండిలా!
How To Opening An RDG Account :ఆర్డీజీ అకౌంట్‌ను ఓపెన్ చేయడానికి పాన్ కార్డ్, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, స్కాన్ చేసిన సంతకం, మొబైల్ నంబర్, ఈ-మెయిల్, చిరునామా సహా పలు నిర్దిష్ట పత్రాలు ఉండాలి. ఇప్పుడు ఆర్డీజీ ఖాతా ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం.
- ముందుగా మీరు https://rbiretaildirect.org.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ పాన్, ఆధార్, సేవింగ్స్ ఖాతా నంబర్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్, చిరునామా సహా మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.
- వెంటనే మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్‌లకు ఓటీపీలు వస్తాయి. వాటిని నమోదు చేసి ధ్రువీకరణ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి.
- వెంటనే మీకు ఒక రిఫరెన్స్ నంబర్ జనరేట్ అవుతుంది. దానితో మీ అప్లికేషన్ స్టేటస్‌ను ట్రాక్ చేసుకోవచ్చు.
- తరువాత మీరు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. (ఒకవేళ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసినా ఇదే విధంగా చేయాలి.)
- మీ ఆర్డీజీ ఖాతాకు తప్పనిసరిగా నామినీని జత చేయాలి.
- మీ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ ఖాతాకు మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను లింక్ చేయాలి. టోకెన్ ట్రాన్సాక్షన్ చేసి దానిని ధ్రువీకరించుకోవాలి.
- కేవైసీ వెరిఫికేషన్ సక్సెస్ అయిన తరువాత, మీ ఆర్డీజీ అకౌంట్ ఓపెన్ అవుతుంది.
- తరువాత మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ అడ్రస్‌కు ఆర్డీజీ అకౌంట్ క్రెడెన్సియల్స్ అన్నీ వస్తాయి.
- ఈ క్రెడెన్సియల్స్ ఉపయోగించి మీరు ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్‌కి లాగిన్ కావచ్చు.
నోట్ :ఒకవేళ కేవైసీ ధ్రువీకరణ ప్రాసెస్ ఫెయిల్ అయితే మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
రూ.100 ఉంటే చాలు - రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు - ఎలా అంటే? - How To Invest In REITs
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్ - సింగిల్ ఛార్జ్‌తో 160 కి.మీ రేంజ్ - ధర ఎంతంటే? - Ather Rizta Electric Scooter Launch