UPI Cash Deposits In Bank Accounts :బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. త్వరలో బ్యాంక్ ఖాతాదారులు అందరూ నేరుగా యూపీఐ విధానం ద్వారా నగదు డిపాజిట్లు చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తామని ఆర్బీఐ పేర్కొంది. ఇదే జరిగితే, బ్యాంకు ఖాతాదారులు నేరుగా తమ ఫోన్ల నుంచి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసుకోగలుగుతారు.
యూపీఐ డిపాజిట్ ఫెసిలిటీ
క్యాష్ డిపాజిట్ మెషీన్ల వల్ల బ్యాంకులపై చాలా పనిభారం తగ్గుతుందని, ఇది కస్టమర్లకు కూడా మంచి సౌలభ్యంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రస్తుతానికి ఈ నగదు డిపాజిట్ అనేది డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే జరుగుతోంది. అయితే త్వరలో యూపీఐ ద్వారా కూడా క్యాష్ డిపాజిట్ చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తామని ఆయన ఆయన అన్నారు.
"యూపీఐ చెల్లింపులకు మంచి ప్రజాదరణ లభిస్తోంది. అలాగే ఏటీఎంల నుంచి కార్డ్-లెస్ నగదు ఉపసంహరణలకు కూడా ఇది ఉపయోగపడుతోంది. అందుకే త్వరలో యూపీఐ ద్వారా బ్యాంక్ ఖాతాలోకి నేరుగా నగదు డిపాజిట్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించాలని నిర్ణయించాం. త్వరలోనే కార్యాచరణ ఆదేశాలు కూడా జారీ చేస్తాం." - శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్