తెలంగాణ

telangana

ETV Bharat / business

అదిరే ఫీచర్స్​తో న్యూ-జెన్ మారుతి​ కార్లు! CNG, ఎలక్ట్రిక్ ఆప్షన్లతో త్వరలో లాంఛ్ కానున్న మోడల్స్​​ ఇవే! - Upcoming New Gen Maruti Suzuki Cars - UPCOMING NEW GEN MARUTI SUZUKI CARS

Upcoming New Gen Maruti Suzuki Cars : మారుతి కార్​ లవర్స్​కు గుడ్ న్యూస్​. మారుతి సుజుకి కంపెనీ త్వరలో 3 కొత్త జనరేషన్​​ కార్లను భారత్​లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. డిజైన్ పరంగా వీటిలో పలు మార్పులు చేస్తున్నట్లు సమాచారం. మరెందుకు ఆలస్యం, ఈ నయా కార్లలోని లేటెస్ట్ ఫీచర్స్ సహా​, ప్రైస్​ వివరాల గురించి తెలుసుకుందాం.

Upcoming New Gen Maruti Suzuki Cars
Upcoming New Gen Maruti Suzuki Cars (GettyImages)

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 11:08 AM IST

Upcoming New Gen Maruti Suzuki Cars :మన దేశంలో పరిచయం అక్కరలేని పేరు మారుతి సుజుకి. ఏటా అత్యధిక కార్ల సేల్స్‌తో ఈ కంపెనీ టాప్ ప్లేస్‌లో నిలుస్తుంటుంది. మారుతి సుజుకి మరి కొన్ని నెలల్లో మూడు కొత్త​ కార్లను భారత విపణిలో​ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అవి: మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్​జీ, న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్, మారుతి సుజుకి ఈవీఎక్స్​ ఎస్​యూవీ. ఈ న్యూ మోడల్ కార్లలో కొత్త రకం ఇంజన్లు, ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.

1. Maruti Suzuki Swift CNG :న్యూ-జెన్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు సీఎన్​జీ వెర్షన్​లో రిలీజ్​ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ద్వితియార్ధంలో ఈ కారు​ లాంఛ్​ చేయనున్నట్లు సమాచారం. ఈ కారును ప్రస్తుతం భారత దేశ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా రీడిజైన్ చేస్తున్నారు. అయితే ఈ సీఎన్​జీ వల్ల పవర్​ ఔట్​పుట్​ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ 32 కి.మీ/కిలో మైలేజ్​ ఇస్తుందని సమాచారం. ఇక పెట్రోల్​ వెర్షన్​ కంటే ఈ సీఎన్​జీ ఇంజిన్​తో వస్తున్న కారు ధర రూ.90,000-రూ.95,000 ఎక్కువగా ఉండనున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం.

2. New Gen Maruti Suzuki Dzire :ఈ న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్ కారును వచ్చే నెల(జులై)లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇంతకుముందు 'డిజైర్' మోడల్‌లో వచ్చిన కార్లు దేశంలో పెద్దఎత్తున అమ్ముడయ్యాయి. కొత్త మోడల్‌తో సేల్స్ మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ కారుపై కొత్తగా సన్‌రూఫ్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే, సన్‌రూఫ్‌ ఫెసిలిటీ పొందిన తొలి సెడాన్ కారుగా న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్ నిలుస్తుంది. ఈ కారు ఎక్స్​ట్రా బూట్​ స్పేస్​తో వస్తున్నట్లు తెలుస్తోంది. దీని కొలతలన్నీ పాత మోడల్‌ తరహాలోనే ఉంటాయని సమాచారం. ఈ కారులో 1.2లీటర్​ Z సిరీస్‌కు చెందిన మూడు సిలిండర్ల Z12E పెట్రోల్ ఇంజిన్‌‌ అమరుస్తున్నారు. ఇది 111.7 Nm పీక్​ టార్క్​ ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. దీనికి మాన్యువల్​, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఫీచర్లను జతపరుస్తున్నారని సమాచారం. వీటికి అదనంగా ఆటోమేటిక్ HVAC, కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సైతం కారులో ఉంటాయి. కొత్త తరహా ఫ్రంట్ గ్రిల్, అప్‌గ్రేడ్ చేసిన హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్స్, కొత్త సెట్ బంపర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

3. Maruti Suzuki eVX Electric SUV :ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తున్న మారుతి సుజుకి 2024 చివరి నాటికి మారుతి సుజుకి eVX ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్​ చేస్తున్న ఈ కారును, బోర్న్-ఎలక్ట్రిక్ స్కేట్​బోర్డ్ ప్లాట్​ఫామ్​పై నిర్మిస్తున్నారు. దీన్నే మారుతి-టయోటా సంయుక్తంగా నిర్మిస్తున్న కార్లలో ఉపయోగించనున్నారు. ఈ కారు 2700mm వీల్‌బేస్‌తో 4.3 మీటర్ల పొడవు ఉంటుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కారుల రెండు బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో ఒక ఛార్జ్‌పై 400 కిలో మీటర్ల రేంజ్​తో 48 kWh బ్యాటరీ ఒకటి. 550 కిలో మీటర్ల రేంజ్​ ఇచే 60 kWh బ్యాటరీ మరొకటి. హ్యుందాయ్ క్రెటా ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీ వంటి వాటికి పోటీగా మారుతి సుజుకి ఈ కారును విడుదల చేయనుంది.

అప్లై చేయకపోయినా క్రెడిట్ కార్డ్ జారీ అయ్యిందా? మిస్​యూజ్​ అయ్యే ఛాన్స్​! ఇలా చేస్తే మీరు సేఫ్! - Credit Card Issued Without Consent

ఒకే ఏడాదిలో ఉద్యోగాలు మారారా? ITR ఫైలింగ్​లో ఫారం-16 ఎలా పొందాలంటే? - ITR Form 16

ABOUT THE AUTHOR

...view details