తెలంగాణ

telangana

ETV Bharat / business

2024-25లో లాంఛ్ కానున్న టాప్​-8 కాంపాక్ట్​ SUV కార్స్ ఇవే!

Upcoming Compact SUV Cars 2024 : కార్ లవర్స్ అందరికీ గుడ్​ న్యూస్​. మారుతి సుజుకి, హ్యుందాయ్​, మహీంద్రా, టయోటా, స్కోడా, ఎంజీ లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ లేటెస్ట్ ఎస్​యూవీ కార్లను ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

Upcoming SUV cars 2024
Upcoming Compact SUV cars 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 11:26 AM IST

Upcoming Compact SUV Cars 2024 :భారత్​లో కార్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు తమ లేటెస్ట్ కార్లను ఇండియా మార్కెట్లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. వాటిలో మారుతి సుజుకి, మహీంద్రా, హ్యుందాయ్​, టయోటా, స్కోడా, ఎంజీ లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఉన్నాయి. ఇవి ఈ 2024లో తమ లేటెస్ట్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ కార్లను లాంఛ్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. మరి మోడల్స్​పై మనమూ ఓ లుక్కేద్దామా?

  1. Mahindra XUV300 Facelift :ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా ఈ ఏడాది రెండో లేదా మూడో త్రైమాసికంలో ఎక్స్​యూవీ 300 ఫేస్​లిఫ్ట్​ & ఎక్స్​యూవీ 300 ఈవీ కార్లను లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ కారు 1.2 లీటర్​ పెట్రోల్​, 1.5 లీటర్​ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్​తో వస్తుంది. అంతేకాదు దీనిలో న్యూ ఆటోమేటిక్​ ట్రాన్స్​మిషన్​ గేర్​బాక్స్​ను కూడా పొందుపరిచింది. ఈ కారు ఇంటీరియర్​, ఎక్స్​టీరియర్ డిజైన్​లోనూ పలుమార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
  2. Mahindra XUV300 EV :మహీంద్రా ఎక్స్​యూవీ300 ఈవీ కారు విషయానికి వస్తే, ఎక్స్​యూవీ 400 కారులో ఉన్న బ్యాటరీనే, ఈ అప్​కమింగ్ ఈవీలోనూ పొందుపరిచినట్లు సమాచారం.
  3. Toyota Taisor : మారుతి సుజుకి ఫ్రాంక్స్​ రీబ్యాడ్జ్​డ్​ వెర్షనే ఈ టయోటా టైసర్​. త్వరలోనే దీనిని లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ టయోటా టైసర్ కారులోని పవర్​ట్రైన్​, ట్రాన్స్​మిషన్ లైనప్​లను ఫ్రాంక్స్​ కారు నుంచే తీసుకున్నారు. అయితే ఈ టైసర్ ఎస్​యూవీ​ కారులో పలు మైనర్​ ఇంటీరియర్​, ఎక్స్​టీరియర్​ మార్పులు చేసినట్లు సమాచారం.
  4. Skoda Compact SUV : స్కోడా ఇండియా 2.5 ప్రాజెక్ట్ కింద ఈ సంవత్సరం చివరిలోపు స్కోడా కాంపాక్ట్​ ఎస్​యూవీ కారును లాంఛ్ చేసే అవకాశం ఉంది. కుషాక్​, టైగున్​ కార్లలో ఉపయోగించిన 1.0 లీటర్​ టర్బో పెట్రోల్ ఇంజిన్​నే ఈ స్కోడా కంపాక్ట్ ఎస్​యూవీలోనూ పొందుపరిచారు. పైగా ఇది MT, AT ఆప్షన్స్​లో లభిస్తుంది.
  5. Next-Gen Hyundai Venue :సెకండ్ జనరేషన్​ హ్యుందాయ్ వెన్యూ బహుశా 2025వ సంవత్సరం ఫస్ట్ఆఫ్​లో వచ్చే అవకాశం ఉంది. హ్యుందాయ్ కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్​యూవీ కారులో పలు ఎక్స్​టీరియర్, ఇంటీరియర్ డిజైన్ మార్పులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇంజిన్​నే కొనసాగించవచ్చు. కానీ ఎక్విప్​మెంట్స్ మాత్రం అప్​గ్రేడ్ చేయవచ్చని తెలుస్తోంది.
  6. Maruti Suzuki Fronx Facelift : ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారును బహుశా 2025లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. స్థానికంగా అభివృద్ధి చేసిన HEV సిస్టమ్​ను ఈ కారులో అమరుస్తున్నారు. ఇలా అమర్చిన తొలి బండి ఇదే కావడం విశేషం. ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారులో 1.2 లీటర్​ జెడ్ సిరీస్​ ఇంజిన్​ను అమరుస్తున్నారు. ఇది లీటర్​కు 35 కి.మీ మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది.
  7. Kia Clavis (AY) : ఈ కియా క్లావిస్​ కారును బహుశా ఈ ఏడాది చివరల్లో విడుదల చేసే అవకాశం ఉంది. సేల్​ మాత్రం 2025లో ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కారు కియా సోనెట్​ కంటే కాస్త పెద్దదిగా ఉంటుంది. రగ్గడ్​ లుక్స్​తో, స్పేసియస్ ఇంటీరియర్​తో ఇది వస్తుంది. ఈ కాంపాక్ట్ ఎస్​యూవీ కారు ఎలక్ట్రిక్​, పెట్రోల్​, హైబ్రిడ్ వేరియంట్లలో వస్తుందని సమాచారం.
  8. MG Comet Based Compact SUV : ఎంజీ కామెట్​ ఆధారంగా రూపొందించిన కాంపాక్ట్ ఎస్​యూవీ కారును బహుశా 2025 మొదటి అర్థభాగంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సబ్​-ఫోర్​-మీటర్​ కారు, ఎంజీ హెక్టర్ కంటే కాస్త చిన్నగా ఉంటుంది. మార్కెట్లో ఇది టాటా పంచ్​ ఈవీ, సిట్రోయెన్​ ఈసీ3లతో పోటీపడనుంది.

ABOUT THE AUTHOR

...view details