Upcoming Cars In India 2024 : ప్రస్తుత కాలంలో కుటుంబంతో కలిసి టూర్ వెళ్లాలన్నా, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలన్నా కారు ఉండాల్సిందే. మంచి సీటింగ్, ఫీచర్స్ & స్పెక్స్ ఉన్న కార్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త మోడల్స్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే మరికొద్ది నెలల్లో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమకు చెందిన 8 లేటెస్ట్ కార్లను భారత మార్కెట్లో లాంఛ్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. మరెందుకు ఆలస్యం, వాటి స్పెక్స్, ఫీచర్లుపై ఓ లుక్కేద్దామా?
1. Mahindra Thar Armada & XUV.e8 :
మహీంద్రా థార్ అర్మడా కారు ఈ ఏడాది ఆగస్టులో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ కారు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వెర్షన్ త్రి డోర్ మోడల్ కంటే కాస్త పెద్దదిగా ఉంటుంది. పెద్ద టచ్ స్క్రీన్, ADAS, డ్యూయల్-ప్యాన్ సన్‌రూఫ్, డిజిటల్ కన్సోల్ వంటి అధునాతన సాంకేతికతలతో రిచ్ ఇంటీరియర్‌ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే XUV.e8 ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూడా ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. ఇది ఎక్స్‌యూవీ 700 తరహా లుక్స్‌తో, ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తోంది.
2. Tata Curvv EV & ICE, Nexon iCNG :
టాటా కర్వ్ ఈవీ మరికొద్ది నెలల్లో భారత్‌లో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని సమాచారం. టాటా ఐసీఈ మోడల్ కారు 1.2 లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటరు డీజిల్ ఇంజిన్‌తో మార్కెట్లోకి వస్తుంది. నెక్సాన్ ఐసీఎన్జీ మోడల్ కారును ఈ ఏడాది ప్రారంభంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఇది కూడా ఈ ఏడాది చివర్లో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది.