Upcoming Bikes In India 2024 : భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద టూ-వీలర్ మార్కెట్‌గా ఉంది. అందుకే ఇక్కడ ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు, అన్ని వర్గాల కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ ఆరాటపడుతున్నాయి. అందులో భాగంగా తమ లేటెస్ట్ మోడల్ బైక్‌లను, స్కూటీలను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. వీటిలో 2024లో లాంఛ్ కానున్న టాప్-10 బైక్స్ & స్కూటీస్‌పై ఓ లుక్కేద్దాం రండి.
1. Hero Destini 125 :హీరో డెస్టిని 125 ఈ అక్టోబర్ నెలలోనే లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర బహుశా రూ.83,000 నుంచి రూ.90,000 రేంజ్‌లో ఉండవచ్చని అంచనా. ఈ స్కూటీలో 124.6 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇది 9 bhp పవర్, 10.4 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది CVTతో అనుసంధానమై ఉంటుంది. ఈ స్కూటర్ లీటర్‌కు 59 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మార్కెట్లో దీనికి సుజుకి యాక్సెస్ 125, టీవీఎస్ జూపిటర్ 125ల మధ్య గట్టిపోటీ ఉండనుంది.
2. Kawasaki KLX 230 S : 'కవాసకి కేఎల్‌ఎక్స్ 230 ఎస్' బైక్ కూడా అక్టోబర్‌లోనే విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. దీని ధర బహుశా రూ.2,00,000 నుంచి రూ.2,10,000 వరకు ఉండవచ్చు. ఈ బైక్‌లో 233 సీసీ సామర్థ్యంగల ఇంజిన్ అమర్చారు. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై పనిచేస్తుంది.
3. Hero Xoom 160 :హీరో జూమ్ 160 స్కూటీ కూడా ఈ అక్టోబర్‌లోనే ఇండియన్ మార్కెట్లోకి రానుంది. దీని ధర బహుశా రూ.1,10,000 నుంచి రూ.1,20,000 వరకు ఉంటుందని అంచనా. దీనిలో 156 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో పెయిర్ అయ్యుంటుంది. మార్కెట్లో దీనికి హోండా యూనికార్న్, బజాజ్ పల్సర్ 150, హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ పోటీగా ఉంటాయి.
4. Royal Enfield Classic 350 Bobber : రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బాబర్ బహుశా నవంబర్‌లో లాంఛ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని ధర సుమారుగా రూ.2,00,000 నుంచి రూ.2,10,000 రేంజ్‌లో ఉండవచ్చు. ఈ మోటార్ సైకిల్‌లో 346 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 20.2 bhp పవర్, 27 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై ఉంటుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు. మార్కెట్లో దీనికి జావా పెరాక్, జావా 42 బాబర్ గట్టిపోటీగా నిలవనున్నాయి.