Turbocharger Vs Supercharger:వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా.. కార్ల తయారీదారులు పాతకాలపు ఇంజన్లను పక్కనపెట్టారు. కొత్తగా టర్బోఛార్జర్, సూపర్ఛార్జర్ టెక్నాలజీతో తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసేలా ఇంజన్లో తయారు చేస్తున్నారు. మరి టర్బోఛార్జర్, సూపర్ఛార్జర్ ఇంజన్ల మధ్య తేడాలేంటి? మీ కారులో ఉన్నదేంటి? ఏది బెస్ట్? అన్నది ఇప్పుడు చూద్దాం.
టర్బోఛార్జర్ ఎలా పని చేస్తుంది?:టర్బోఛార్జర్ అనేది ఇంజన్లో దహన ప్రక్రియకు అవసరమైన గాలి శాతాన్ని పెంచడానికి ఉపయోగించే ఓ మెషిన్. ఇది ఇంజన్‌లోకి వెళ్లే గాలి మొత్తాన్ని పెంచడానికి ఒక టర్బైన్‌తో అమర్చుతారు. ఈ టర్బైన్ తిరిగినప్పుడు ఎక్కువ గాలి ఇంజన్‌లోకి వెళ్లి, దహన ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇంజన్ ఎగ్జాస్ట్ పాయింట్ వద్ద టర్బైన్ నుంచి వెళ్లిపోయే పొగ వల్ల కలిగే ఒత్తిడి కారణంగా ఈ టర్బైన్ తిరుగుతుంది.
టర్బోఛార్జర్ ప్రయోజనాలు:
- టర్బోఛార్జర్లో టర్బైన్ లేదా షాఫ్ట్‌కు కనెక్షన్ లేదు. కాబట్టి మెకానికల్ ట్రాక్ ఉండదు. ఈ సాంకేతికత పెద్ద డిస్ప్లేస్మెంట్ ఇంజన్లకు అనుకూలంగా ఉంటుంది.
- సాధారణంగా సూపర్ఛార్జర్ల కంటే తక్కువ ఖర్చుతో ఉంటుంది.
- తక్కువ ఇంజిన్ లోడ్ల వద్ద మంచి పనితీరును అందిస్తుంది.
- ఇంజిన్ వేగం పెరిగేకొద్దీ ఎక్కువ పవర్‌ను అందిస్తుంది.
మీ కారులో ఈ సేఫ్టీ ఫీచర్ ఉందా? - లేదంటే ఇబ్బందే!
సూపర్ఛార్జర్ ఎలా పని చేస్తుంది?:సూపర్ఛార్జర్ పనితీరు కూడా ఇంచు మించు టర్బోఛార్జర్ మాదిరిగానే ఉంటుంది. సూపర్ఛార్జర్ అనేది ఇంజన్‌లోకి ఎక్కువ గాలిని ఆకర్షించే పరికరం. కానీ గాలి తీసుకోవడానికి, తిప్పడానికి ఇది ఎగ్జాస్ట్‌ను ఉపయోగించదు. దానికి బదులుగా క్రాంక్ షాఫ్ట్ వెంటనే తిరిగే, ఇంజన్ సామర్థ్యాన్ని పెంచే సాధనాన్ని మౌంట్ చేస్తుంది. ఈ రెండింటి ఉపయోగం ఒక్కటే అయినప్పటికీ, ఇవి పనిచేసే విధానాలు మాత్రం వేరుగా ఉంటాయి.
సూపర్ఛార్జర్ ప్రయోజనాలు:
- ఇది ఇంజన్‌కు త్వరగా శక్తిని ఇస్తుంది.
- ఈ సాంకేతికతను ఇంజన్లలో ఇన్స్టాల్ చేయడం సులభం.
- ఈ సాంకేతికత చిన్న డిస్ప్లేస్మెంట్ ఇంజన్లకు కూడా అనుకూలంగా ఉంటుంది.
- తక్కువ టర్బో ల్యాగ్ ఉంటుంది.
- ఎందుకంటే ఇంజిన్ వేగం నుంచి నేరుగా శక్తి తీసుకుంటుంది.
ఈ రెండింటిలో ఏది బెస్ట్?:టర్బోఛార్జర్, సూపర్ఛార్జర్ రెండూ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రెండూ ఇంజన్ శక్తిని పెంచడానికి ఉపయోగపడుతాయి. ఈ రెండింటి శక్తి ఒకే విధంగా పెరుగుతుంది. కానీ, ఇంధన వినియోగం విషయానికి వస్తే సూపర్ఛార్జర్ కంటే టర్బోఛార్జర్ తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. అందుకే వాహన తయారీదారులు, కస్టమర్లు ఎక్కువగా టర్బోఛార్జర్ ఇంజన్లను ఇష్టపడతారు.
ట్విన్ ఛార్జర్:ఒకే ఇంజన్లో టర్బోఛార్జర్, సూపర్ఛార్జర్ రెండింటినీ ఒకేసారి ఉపయోగించడం కూడా సాధ్యమవుతుంది. సాధారణంగా రేస్ కార్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనినే ట్విన్ ఛార్జర్ అని కూడా పిలుస్తారు. ఈ ట్విన్ ఛార్జర్‌ను పెట్రోల్ కార్లలో ఉపయోగించడం సులభం కానీ.. డీజిల్ ఇంజిన్‌లో ఉపయోగించలేరు. ఎందుకంటే ఇది ఆర్‌పిఎమ్ కంటే తక్కువ టార్క్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా - ఈ విషయాలు తెలుసా?
శక్తి ఎంత పెరుగుతుంది? :సూపర్ఛార్జర్ ఇంజన్ హార్స్పవర్, టార్క్‌ను పెంచుతుంది. దీంతో.. ఇంజన్ పవర్ 70-80 శాతం పెరుగుతుంది. ఈ శక్తి త్వరగా, సజావుగా లభిస్తుంది. కానీ.. సూపర్ఛార్జర్ నేరుగా ఆర్పిఎమ్కి కనెక్ట్ చేయడం వల్ల ఇది ఇంధన వినియోగాన్ని కూడా పెంచుతుంది. తద్వారా కారు మైలేజీ తగ్గుతుంది. టర్బోఛార్జర్ ఇంజన్ శక్తిని 20-30 శాతం పెంచుతుంది (కొన్నిసార్లు 50 శాతం కూడా పెరిగే అవకాశం ఉంది) కాబట్టి.. ఇది తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది.
మైలేజ్ మైలేజ్ పరంగా చూస్తే..:టర్బోఛార్జర్ ఇంజన్లు అత్యుత్తమ మైలేజీని అందిస్తాయి. కానీ.. ఇంజన్‌కు గరిష్టంగా 50 శాతం శక్తిని మాత్రమే అందిస్తాయి. సగటున 25-30 శాతం శక్తిని మాత్రమే అందిస్తుంది. అదే సమయంలో సూపర్ఛార్జర్ ఏకంగా 80 శాతం శక్తిని అందిస్తుంది. కానీ.. ఇది ఆర్పిఎమ్కి కనెక్ట్ చేసినందు వల్ల 20 శాతం మెకానికల్ లాగ్‌కు కారణమవుతుంది. కాబట్టి.. మీకు మంచి పవర్ అవసరమని అనుకుంటే మీకు సూపర్ఛార్జర్ ఉత్తమమైనది. మీకు పవర్‌తో పాటుగా మైలేజీ కూడా అవసరమని భావిస్తే.. టర్బోఛార్జర్ను ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
క్లచ్ లైఫ్ టైమ్ పెరగాలా? కారు డ్రైవింగ్ సమయంలో ఈ తప్పులు చేయకండి!
కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా? - ఇక్కడ రూ. 5.13 లక్షలకే మారుతి స్విఫ్ట్ కారు!