తెలంగాణ

telangana

ETV Bharat / business

కొత్త కారు కొంటున్నారా? ఈ టాప్​-6 ఫీచర్లు ఉన్నాయో లేదో చూసుకోండి! - best features of car

Top 6 Features For New Cars : మీరు కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఎలాంటి ఫీచర్లు కారులో ఉంటే ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. మీరు కొనుగోలు చేసే కారులో ఈ ఆరు ఫీచర్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.

Top 6 Features For New Cars
Top 6 Features For New Cars

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 3:55 PM IST

Top 6 Features For New Cars : ఈ రోజుల్లో ఓ మంచి కారు కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కారు కొనుగోలు చేసేముందు అందులో అన్ని ఫీచర్లు ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కొత్తగా కారు కొనాలనుకునే వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన ఫీచర్లు ఏంటి? ఏఏ విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి అనే వివరాలు మీ కోసం.

  1. ఎయిర్ బ్యాగ్స్ : దాదాపు అన్ని కార్ల తయారీదారులు తమ ఉత్పత్తుల్లో ప్రామాణికంగా కనీసం 2 ఎయిర్ బ్యాగ్లను అందిస్తాయి. అయితే ఇంకా మెరుగైన భద్రత కోసం కనీసం 6 స్టాండర్డ్ ఎయిర్​బ్యాగులు ఉన్న కారును ఎంచుకోవడం మంచిది. ఇవి డ్యాష్ బోర్డు, ఆక్యుపెంట్ మధ్య ఉండి ప్రమాదం జరిగే సమయంలో తెరుచుకుని మనల్ని కాపాడతాయి.
  2. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ : కారులో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్(టీఎమ్​పిఎస్​) అతి ముఖ్యమైనది. ఇది టైర్ గాలి ప్రెజర్​ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. తద్వార కారు సాఫీగా పనిచేసేలా చేస్తుంది. టైర్లో తగినంత ఎయిర్​ లేనప్పుడు అదుపు తప్పి ప్రమాదం జరిగే అవకాశముంది. TPMS టైర్ ప్రెజర్ గురించి కారు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్​పై డ్రైవర్ కు హెచ్చరికలు పంపిస్తుంది.
  3. ఇన్ బిల్ట్ నావిగేషన్​: మనం కారులో ప్రయాణించేటప్పుడు లొకేషన్​ను తెలుసుకునేందుకు కారులోనే నేవిగేషన్​ సిస్టమ్ ఉంటే మంచిది. దీనివల్ల ప్రతిసారీ మొబైల్​ సహాయంతో లొకేషన్​ చెక్​ చేసుకునే అవసరం తప్పుతుంది. జీపీఎస్​ కలిగి ఉన్న అనేక యాప్​లు ఇదే పనిని చేస్తాయి. ప్రస్తుత కాలంలో చాలా కార్లలో నేవిగేషన్​ ఫెసిలిటీ ఇన్​బిల్ట్​గా వస్తోంది.
  4. పార్కింగ్ సెన్సర్లు :కారులో పార్కింగ్ సెన్సర్లు చాలా ముఖ్యమైనవి. పార్కింగ్ ప్రదేశంలో ఎక్కువ కార్లను ఉంచి ఉన్నప్పుడు ఒక్కోసారి మనం వాహనం ఎక్కడ ఉందో తెలుసుకోవడం కాస్త కష్టమవుతుంది. అందువల్ల అలాంటి సందర్భాల్లో ఉపయోగపడేదే ఈ పార్కింగ్ సెన్సర్లు. వీటి సహాయంతో మన కారు ఎక్కడ ఉందో తెలుసుకోవడం సులభంగా ఉంటుంది. కారు ముందు, వెనక భాగంలో ఈ సెన్సర్లు ఉంటాయి.
  5. క్రూయిజ్ కంట్రోల్ : కార్లలో స్టాండర్డ్, అడాప్టివ్ అనే రెండు రకాల క్రూయిజ్ కంట్రోల్ అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్రూయిజ్ కంట్రోల్ మిమ్మల్ని హైవేపై ఒక నిర్దిష్టమైన స్పీడ్​లో ఉంచుతుంది. కానీ మీ కారు చుట్టూ ఇతర వాహనాలు ఉన్నసమయంలో పెద్దగా పనిచేయదు. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ అధునాతనమైనది. పరిస్థితిని బట్టి పనిచేస్తుంది. ముందు ఏదైనా వాహనం ఉంటే సురక్షితమైన దూరంలో ఉంచేందుకు కారు వేగాన్ని తగ్గిస్తుంది.
  6. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ :ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) ఇది మరో ఉపయోగకరమైన ఫీచర్. సెన్సర్ల ద్వారా పనిచేస్తుంది. మీ కారుకు దగ్గరగా ఏదైనా ఇతర వాహనం వచ్చినప్పుడు ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఆటోమేటిక్​గా బ్రేక్స్ వేస్తుంది. ఇది యాక్టివేట్ అయిన వెంటనే కారు వేగాన్ని తగ్గిస్తుంది. ఒకవేళ కారు అతివేగంతో ఉండి కంట్రోల్ చేయకపోయినా వేగాన్ని తగ్గిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details