Best Mileage Cars In 2025 : ఈ 2025లో మంచి మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్-10 ఫ్యూయెల్ ఎఫీషియెంట్ ఎస్‌యూవీ కార్ల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
10. Tata Nexon : భారతదేశంలోని బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ కార్లలో టాటా నెక్సాన్ ఒకటి. ఈ కారులో 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 120 హెచ్‌పీ పవర్ జనరేట్ చేస్తుంది. ఇది మాన్యువల్, ఏఎంటీ, డ్యూయెల్ క్లెచ్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది. ఇది 5స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అనుసంధానంతో పనిచేస్తుంది.
ఇంజిన్ | ట్రాన్స్‌మిషన్ | ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ |
1199సీసీ టర్బో-పెట్రోల్ | 5 స్పీడ్ మాన్యువల్ | 17.44 కి.మీ/లీటర్ |
1199సీసీ టర్బో-పెట్రోల్ | 6 స్పీడ్ ఏఎంటీ | 17.18 కి.మీ/లీటర్ |
1199సీసీ టర్బో-పెట్రోల్ | 7 స్పీడ్ డీసీటీ | 17.01 కి.మీ/లీటర్ |
Tata Nexon Price : మార్కెట్లో టాటా నెక్సాన్ కారు ధర సుమారుగా రూ.8 లక్షలు - రూ.15.60 లక్షల వరకు ఉంటుంది.
9. Kia Syros : మంచి మైలేజ్ ఇచ్చే కాంపాక్ట్ ఎస్‌యూవీ కొనాలని అనుకునేవారికి కియా సైరోస్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ కారులో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 120 హెచ్‌పీ పవర్ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 7 స్పీడ్ డ్యూయెల్ క్లెచ్ గేర్ బాక్స్ అనుసంధానంతో పనిచేస్తుంది.
ఇంజిన్ | ట్రాన్స్‌మిషన్ | ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ |
998 సీసీ టర్బో-పెట్రోల్ | 6 స్పీడ్ మాన్యువల్ | 18.2 కి.మీ/లీటర్ |
998 సీసీ టర్బో-పెట్రోల్ | 6 స్పీడ్ ఏఎంటీ | 17.68 కి.మీ/లీటర్ |
Kia Syros Price : మార్కెట్లో కియా సైరోస్ కారు ధర సుమారుగా రూ.9 లక్షలు - రూ.17 లక్షల వరకు ఉంటుంది.
8. Hyundai Venue : హ్యుందాయ్ వెన్యూ రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 83 హెచ్‌పీ పవర్ జనరేట్ చేస్తుంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 120 హెచ్‌పీ పవర్ జనరేట్ చేస్తుంది.
ఇంజిన్ | ట్రాన్స్‌మిషన్ | ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ |
1197 సీసీ పెట్రోల్ | 5 స్పీడ్ మాన్యువల్ | 17.52 కి.మీ/లీటర్ |
998 సీసీ టర్బో-పెట్రోల్ | 5 స్పీడ్ మాన్యువల్ | 18.27 కి.మీ/లీటర్ |
998 సీసీ టర్బో-పెట్రోల్ | 7 స్పీడ్ డీసీటీ | 18.15 కి.మీ/లీటర్ |
Hyundai Venue Price : మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ కారు ధర సుమారుగా రూ.7.94 లక్షలు - రూ.13.62 లక్షల వరకు ఉంటుంది.
7. Kia Sonet : మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనాలని అనుకునేవారికి కియా సోనెట్ బాగుంటుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.
ఇంజిన్ | ట్రాన్స్‌మిషన్ | ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ |
1197 సీసీ పెట్రోల్ | 5 స్పీడ్ మాన్యువల్ | 18.83 కి.మీ/లీటర్ |
998 సీసీ టర్బో-పెట్రోల్ | 6 స్పీడ్ క్లెచ్‌లెస్ మాన్యువల్ | 18.7 కి.మీ/లీటర్ |
998 సీసీ టర్బో-పెట్రోల్ | 7 స్పీడ్ డీసీటీ | 19.2 కి.మీ/లీటర్ |
Kia Sonet Price : మార్కెట్లో కియా సోనెట్ కారు ధర సుమారుగా రూ.8 లక్షలు - రూ.15.70 లక్షల వరకు ఉంటుంది.
6. Skoda Kylaq : 2024 డిసెంబర్‌లో లాంఛ్ అయిన బ్రాండ్ న్యూ స్కోడా కైలాక్ మంచి ఫ్యూయెల్ ఎఫీషియెంట్ కార్. దీనిలో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 115 హెచ్‌పీ పవర్ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ అనుసంధానంతో పనిచేస్తుంది.
ఇంజిన్ | ట్రాన్స్‌మిషన్ | ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ |
999 సీసీ టర్బో-పెట్రోల్ | 6 స్పీడ్ మాన్యువల్ | 19.05 కి.మీ/లీటర్ |
999 సీసీ టర్బో-పెట్రోల్ | 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ | 19.68 కి.మీ/లీటర్ |
Skoda Kylaq Price : మార్కెట్లో స్కోడా కైలాక్ కారు ధర సుమారుగా రూ.7.89 లక్షలు - రూ.14.40 లక్షల వరకు ఉంటుంది.
5. Maruti Suzuki Brezza : ఇండియాలోని బెస్ట్ కార్లలో మారుతి సుజుకి బ్రెజ్జా ఒకటి. ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అనుసంధానంతో పనిచేస్తుంది.
ఇంజిన్ | ట్రాన్స్‌మిషన్ | ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ |
1462 సీసీ పెట్రోల్ | 5 స్పీడ్ మాన్యువల్ | 17.38 కి.మీ/లీటర్ |
1462 సీసీ పెట్రోల్ | 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ | 19.8 కి.మీ/లీటర్ |