Tips To Maintain Good Credit Score :క్రెడిట్ స్కోర్ గురించి ప్రత్యేకించి చర్చించాల్సిన పనిలేదు. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే మనకు సులభంగా లోన్లు మంజూరు అవుతాయి. వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది. అందుకే రుణగ్రహీతలకు క్రెడిట్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ లేదా క్రెడిట్ కార్డు పొందడం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం కోల్పోయిన సమయంలో క్రెడిట్ స్కోర్‌ను కాపాడుకోవడం చాలా కష్టం. అయినా కూడా మీరు ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లోనూ క్రెడిట్ స్కోర్‌ను కాపాడుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
1. మీ క్రెడిట్ కార్డును రివ్యూ చేయండి
ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, ట్రాన్స్‌యూనియన్ వంటి ప్రధాన క్రెడిట్ బ్యూరోల నుంచి మీ క్రెడిట్ రివ్యూకు సంబంధించి ఉచిత కాపీని తీసుకోండి. అందులో ఏమైనా లోపాలు లేదా తప్పులు ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసుకోండి.
2. తప్పులు ఉన్నాయేమో తెలుసుకోండి
మీ క్రెడిట్ స్కోరులో ఏవైనా తప్పులు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. లేటుగా పేమెంట్ చేయడం లేదా మీకు సంబంధించని అకౌంట్స్ అయితే వాటిలో లోపాలను గుర్తించి క్రెడిట్ బ్యూరోలతో చర్చించండి. ఈ లోపాలను సరిదిద్దుకుంటే మీ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది.
3. సకాలంలో క్రెడిట్ రీపేమెంట్స్ చేయండి
మీరు అన్ని క్రెడిట్ పేమెంట్స్‌ను సకాలంలో చేశారని నిర్ధరించుకోవడం చాలా ముఖ్యం. మీ క్రెడిట్ స్కోరును నిర్వహించడానికి, మెరుగుపరచడానికి అత్యంత కీలకమైన అంశం. మీరు నిరుద్యోగులుగా ఉన్నప్పటికీ, చెల్లింపులలో ముందుగా ఉండటం ముఖ్యం.
4. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లను తగ్గించండి
మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లను వీలైనంత వరకు చెల్లించడానికి ప్రయత్నించండి. మీ క్రెడిట్ పరిమితులకు సంబంధించి ఎక్కువగా పెండింగ్స్ ఉంటే మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తాయి. బ్యాలెన్స్‌లను తక్కువగా ఉంచడం లేదా వాటిని పూర్తిగా చెల్లించడం మీ స్కోర్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.