Safety Driving Tips for AMT Cars :ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కార్లను ఎంచుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీని ప్రత్యేకత ఏమంటే.. అవసరాన్ని బట్టి మాన్యువల్‌గా గేర్లు మార్చుకుంటూ డ్రైవ్ చేయవచ్చు. అవసరం లేనపుడు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఉపయోగిస్తూ వెళ్లొచ్చు. అయితే.. ఆటోమేటిక్ విధానాన్ని ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అంటున్నారు ఆటోమొబైల్ రంగ నిపుణులు. లేదంటే తీవ్ర నష్టాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఇంతకీ.. ఆ జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
AMT గేర్ బాక్స్ పనితీరు : AMT కార్లలో గేర్లు మనం వేయకుండానే వాటంతట అవే పడతాయి కాబట్టి.. వాటి గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది భావిస్తారు. కానీ.. ఏఎమ్‌టీ గేర్ బాక్స్ పనితీరు గురించి తెలుసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. మాన్యువల్, ఏఎమ్‌టీ రెండు ఒకేలా పనిచేస్తాయి. సాధారణంగా మాన్యువల్ పద్ధతిలో గేరు మార్చేటప్పుడు యాక్సిలరేషన్ తగ్గించి, క్లచ్ నొక్కి గేర్ ఛేంజ్ చేశాక యాక్సిలరేషన్ పెంచుతాం. అదే.. ఏఎమ్టీలో దానంతట అదే గేరు మార్చాలనుకుంటే.. యాక్సిలరేషన్ పై కాలు తీసి మళ్లీ పెడితే గేర్ ఛేంజ్ అవుతుంది. తగ్గించాలనుకుంటే పూర్తిగా యాక్సిలరేషన్ తీసేస్తే చాలు.
ఇంజిన్ ఆఫ్ చేయడంపై అవగాహన :చాలా మందికి మాన్యువల్ గేర్ బాక్స్ కార్ల మీద అవగాహన ఉంటుంది. కానీ.. ఏఎమ్‌టీ కార్లలో విషయంలో ఉండదు. ముఖ్యంగా.. క్లచ్, ఇంజిన్ ఆఫ్ చేసే విషయంలో సరైన అవగాహన లేక పొరపాట్లు చేస్తుంటారు. ఏఎమ్‌టీ కార్లలో ఇంజిన్ ఆఫ్ చేసే ముందు ట్రాన్స్‌మిషన్‌ను న్యూట్రల్లో ఉంచడం చాలా ముఖ్యం. ఇది ట్రాన్స్‌మిషన్‌ను దెబ్బతినకుండా కాపాడుతుంది.
అలర్ట్ : ఎండలు మండుతున్నాయ్ - మీ సీఎన్జీ కారును ఇలా కాపాడుకోండి! - CNG CAR SUMMER PRECAUTIONS