తెలంగాణ

telangana

భవిష్యత్​కు ఆర్థిక భరోసా కావాలా? టాప్-5 ఇన్వెస్ట్​మెంట్ స్కీమ్స్​ ఇవే! - Investment Options For Future

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2024, 6:32 AM IST

Investment Options For Future : మీరు భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారా? మంచి పెట్టుబడి మార్గం గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. భారతదేశంలో ఉన్న 5 ప్రధానమైన పెట్టుబడి మార్గాల (ఇన్వెస్ట్​మెంట్ ఆప్షన్స్​) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Investment Options For Future
Investment Options For Future (ETV Bharat)

Investment Options For Future :ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటారు. తమ కష్టార్జితమైన సొమ్మును నష్టపోకుండా, మంచి రాబడి సంపాదించాలని ఆశిస్తారు. ఇలాంటి వారి కోసం మన దేశంలో అనేక పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. ఇవి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించడానికి వీలు కల్పిస్తాయి. అయితే వీటిలో మీకు అనువైన దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ ఆర్టికల్​​లో మన దేశంలో అందుబాటులో ఉన్న 5 ప్రధానమైన పెట్టుబడి మార్గాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఈక్విటీలు
ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి రాబడిని పొందొచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ద్రవ్యోల్బణాన్ని అధిగమించే దీర్ఘకాలిక లాభాలను సంపాదించవచ్చు. మీరు నేరుగా ఈక్విటీలలో పెట్టుబడి పెట్టకూడదనుకుంటే, మ్యూచువల్ ఫండ్స్ మరో ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. దీర్ఘకాల రాబడిని ఆళించేవారికి మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్​గా ఉంటాయి.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)
నెలవారీ పెన్షన్ పొందేందుకు మరో బెస్ట్ స్కీమ్ 'నేషనల్ పెన్షన్ సిస్టమ్'(NPS). దీంట్లో చేరిన వారు 60 ఏళ్లు వచ్చే వరకు ఇన్వెస్ట్ చేయాలి. అత్యవసర సమయాల్లో 60 శాతం వరకు డబ్బులు తీసుకోవచ్చు. మిగతాది యాన్యుటీకి వెళ్తుంది. దీనిని పెన్షన్ రూపంలో అందుకోవచ్చు. అందుకే దీన్ని సేవింగ్స్ కమ్ రిటైర్మెంట్ స్కీమ్​గా పిలుస్తారు. ఎన్ పీఎస్​లో పెట్టుబడులు పెట్టడం వల్ల పన్ను మినహాయింపులను పొందొచ్చు. అయితే, ఎన్ పీఎస్​లో గరిష్ట ఈక్విటీ కేటాయింపు 75 శాతం మాత్రమే ఉంటుంది.

గోల్డ్ అండ్ సిల్వప్ ఈటీఎఫ్
భారతదేశంలో చాలా మంది బంగారం, వెండి కొనేందుకు ఇష్టపడతారు. కష్ట సమయంలో ఇవి మనల్ని ఆదుకుంటాయని నమ్ముతారు. అందుకే బంగారం, వెండిపై ఇన్వెస్ట్‌ మెంట్ల ద్వారా కూడా మంచి రాబడిని పొందొచ్చు. ఇవి ద్రవ్యోల్బణం బారం నుంచి మిమ్మల్ని కాపాడతాయి. బంగారం, వెండి ఈటీఎఫ్​లు మీ పోర్ట్‌ ఫోలియోను మెరుగుపరుస్తాయి.

డెట్ ఫండ్లు/ బాండ్లు
ఈక్విటీలతో పోలిస్తే డెట్ ఫండ్లు, బాండ్లలో పెట్టుబడుల్లో తక్కువ రిస్క్ ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్ మంచి రాడిని అందిస్తుంది.

రియల్ ఎస్టేట్
భౌతిక ఆస్తిని సొంతం చేసుకోవాలనుకునే వారికి రియల్ ఎస్టేట్​లో పెట్టుబడులు ఒక మంచి ఆప్షన్. రియల్ ఎస్టేట్​లో ఇన్వెస్ట్ చేసి మంచి రాబడిని పొందొచ్చు. భూమి లేదా ఇల్లు ఉన్నట్లయితే అద్దెకు ఇవ్వడం లేదా కొన్నేళ్ల తర్వాత విక్రయించడం వల్ల లాభాలు పొందొచ్చు. అయితే ఇందులో పెట్టుబడులకు ఎక్కువ మూలధనం అవసరం కావడం వల్ల చాలా మంది ప్రత్యామ్నాయ మర్గాల్లో ఇన్వెస్ట్ చేస్తారు.

రూ.1500 పెట్టుబడితో చేతికి రూ.5లక్షలు - అద్దిరిపోయే స్కీమ్​ - మీకు తెలుసా? - Public Provident Fund Scheme

వారెన్ బఫెట్ చెప్పిన ఈ 5 టిప్స్‌​ పాటిస్తే చాలు - స్టాక్​ మార్కెట్లో లాభాలు గ్యారెంటీ! - Warren Buffett Money Lessons

ABOUT THE AUTHOR

...view details