తెలంగాణ

telangana

ETV Bharat / business

నిన్నటి వరకు ఆ కంపెనీలో నెల జీతగాళ్లు- నేటి నుంచి కోటీశ్వరులు- ఎలా అంటే? - SWIGGY IPO MAKES CROREPATIS

దలాల్ స్ట్రీట్​లో స్విగ్గీ గ్రాండ్ ఎంట్రీ - ఏకంగా 500 మందిని కోటీశ్వరులను చేసిన IPO

Swiggy IPO
Swiggy IPO (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 4:04 PM IST

Swiggy IPO Makes Employees Crorepatis :ప్రముఖ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ దలాల్ స్ట్రీట్​లో గ్రాండ్​గా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు దాదాపు 500 మంది స్విగ్గీ ఉద్యోగులను ఏకంగా కోటీశ్వరులను చేసింది. ఇలా కరోడ్ పతి అయిన వారిలో ప్రస్తుతం స్విగ్గీలో పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు, మాజీలు కూడా ఉన్నారు.

స్విగ్గీ తమ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా 'ఎంప్లాయీస్​ స్టాక్ ఆప్షన్ ప్లాన్​' (ESOP) తీసుకువచ్చింది. దీని మొత్తం విలువ రూ.9,000 కోట్లుగా ఉంది. దీనిలో స్విగ్గీలో పనిచేస్తున్న దాదాపు 5000 మంది సిబ్బందికి వాటాలు ఉన్నాయి.

స్విగ్గీ ఐపీఓ ఇష్యూ ధర రూ.371 - రూ.390గా ఉంది. కానీ బుధవారం ఎన్​ఎస్​ఈలో స్విగ్గీ షేర్లు ఇష్యూ ధర రూ.390 కంటే, దాదాపు 8 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. అంటే సిగ్గీ షేర్లు మార్కెట్లో రూ.420 వద్ద లిస్ట్ అయ్యాయి. అలాగే బీఎస్​ఈలో స్విగ్గీ ఇష్యూ ధర కంటే 5.64 శాతం ఎగబాకి రూ.412 వద్ద లిస్ట్ అయ్యింది. తరువాత ఆ లాభం 7.67 శాతం పెరిగి రూ.419.95కు చేరింది. దీనితో తమ ఉద్యోగుల షేర్లు విలువ అమాంతం పెరిగింది. దీనితో దాదాపు 500 మంది ఉద్యోగుల దగ్గర ఉన్న షేర్ల విలువ రూ.2 కోట్ల వరకు పెరిగింది. అంతేకాదు ఈ బంపర్ లిస్టింగ్​ ద్వారా 5000 మంది స్విగ్గీ ఉద్యోగుల వద్ద షేర్ల విలువ ఏకంగా రూ.9,000 కోట్లకు పెరిగింది.

ఐపీఓ డీటైల్స్ ఇవే!
స్విగ్గీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ నవంబర్‌ 8న ముగిసింది. షేర్ ధరల శ్రేణిని రూ.371-390గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో తాజా షేర్ల జారీ ద్వారా రూ.4,499 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రూ.6,828 కోట్లు సమీకరించింది. వాస్తవానికి రూ.11,327 కోట్ల విలువైన ఈ ఐపీఓ మొత్తం 3.599 రెట్ల వరకు సబ్‌స్క్రిప్షన్‌ పొందింది. 16 కోట్ల షేర్లకు గానూ 57.53 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల కోటా 6.02 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అవ్వగా, రిటైల్‌ ఇన్వెస్టర్లు 1.14 రెట్ల వరకు సబ్‌స్క్రైబ్​ చేశారు. ఇక నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కోటా 41 శాతం మాత్రమే సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. కాగా స్విగ్గీ ఇప్పటికే రూ.5,085 కోట్లను యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది. స్విగ్గీ ఈ ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని టెక్నాలజీ, క్లౌడ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​లో పెట్టుబడులకు, బ్రాండ్ మార్కెటింగ్​, బిజినెస్ ప్రమోషన్ సహా రుణ చెల్లింపులకు ఉపయోగించనుంది.

ABOUT THE AUTHOR

...view details