Stock Market Close :దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. మంగళవారం నాటి భారీ నష్టాలతో కుదేలైన మదుపరులకు గొప్ప ఊరట కల్పించాయి. మార్కెట్లు రీబౌండ్ కావడం వల్ల దాదాపు అన్ని రంగాలు లాభపడ్డాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 2303 పాయింట్లు లాభపడి 74,382 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 735 పాయింట్లు వృద్ధిచెంది 22,620 వద్ద ముగిసింది.
లాభపడిన స్టాక్స్ :ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, బజాబ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్
గ్రేట్ కమ్‌బ్యాక్
బుధవారం స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు స్ట్రాంగ్ కమ్‌బ్యాక్‌తో మదుపరులకు గొప్ప ఊరట కల్పించాయి. ఇవాళ ఏకంగా 3 శాతం మేర లాభపడి, నిన్నటి భారీ నష్టాలను చాలా వరకు కవర్ చేశాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీని సాధించాయి. ఇది మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచింది. అందుకే ఇవాళ స్టాక్ మార్కెట్లు బౌన్స్ బ్యాక్ అయ్యాయి.
ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో సియోల్ ఒక్కటో లాభాలతో గట్టెక్కింది. టోక్యో, షాంఘై, హాంకాంగ్‌లు నష్టాలతో ముగిశాయి. ప్రస్తుతానికి యూరోపియన్ మార్కెట్లు మంచి లాభాలతో కొనసాగుతున్నాయి. మంగళవారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.
03.00 PM :ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 2318 పాయింట్లు లాభపడి 74,397 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 728 పాయింట్లు వృద్ధిచెంది 22,613 వద్ద కొనసాగుతోంది.
01.39 PM :ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1709 పాయింట్లు లాభపడి 73,788 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 544 పాయింట్లు వృద్ధిచెంది 22,429 వద్ద కొనసాగుతోంది.
01.00 PM :ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1541 పాయింట్లు లాభపడి 73,615 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 489 పాయింట్లు వృద్ధిచెంది 22,373 వద్ద కొనసాగుతోంది.
12.15 PM :ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1443 పాయింట్లు లాభపడి 73,520 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 458 పాయింట్లు వృద్ధిచెంది 22,343 వద్ద కొనసాగుతోంది.
11.45 AM :ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1581 పాయింట్లు లాభపడి 73,661 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 498 పాయింట్లు వృద్ధిచెంది 22,383 వద్ద కొనసాగుతోంది.
Stock Market Today June 5, 2024 :నిన్నటి భారీ నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకుని, లాభాల్లోకి దూసుకెళ్లాయి. బుధవారం ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ 948 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్లు మేర లాభపడ్డాయి. ప్రస్తుతం మంచి స్టాక్స్ అన్నీ చాలా తక్కువ ధరకే లభిస్తుండడం వల్ల, మదుపరులు 'వాల్యూ బయ్యింగ్' చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 433 పాయింట్లు లాభపడి 72,525 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 144 పాయింట్లు వృద్ధిచెంది 22,028 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ :హిందూస్థాన్ యూనిలివర్, ఏసియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, కోటక్ బ్యాంక్, ఐటీసీ
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్
మార్కెట్లు లాభాల్లోకి రావడానికి కారణమిదే!
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సరిపడా మెజారిటీని సాధించింది. కనుక కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడే సూచనలు ఉన్నాయి. మోదీ సర్కార్ ఎలాగో వ్యాపార అనుకూల సంస్కరణలు చేస్తుంటుంది. కనుక మార్కెట్లు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశంలోని మొత్తం 543 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 240, కాంగ్రెస్ 99 స్థానాలు గెలిచినట్లు ప్రకటించింది. అంతేకాదు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 272 సీట్ల మెజారిటీ మార్క్‌ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సాధించింది. కనుక ఇకపై స్టాక్ మార్కెట్లు మళ్లీ కోలుకునే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.12,436.22 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు.
ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో సియోల్, హాంకాంగ్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టోక్యో, షాంఘై నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యూఎస్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.
రూపాయి విలువ
Rupee Open June 5, 2024 :అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 7 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.44గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices June 5, 2024 :అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.04 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 77.49 డాలర్లుగా ఉంది.
గుడ్ న్యూస్ - తగ్గిన గోల్డ్ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today
మంచి ఆరోగ్య బీమా పాలసీ ఎంచుకోవాలా? ఈ టాప్-6 టిప్స్ మీ కోసమే! - How To Choose Best Health Insurance