Stock Market Today August 9, 2024 :శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1,098 పాయింట్లు, నిఫ్టీ 270 పాయింట్లు మేర లాభపడ్డాయి. దాదాపు అన్ని రంగాలు కూడా మంచి లాభాల్లోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 817 పాయింట్లు లాభపడి 79,701 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 240 పాయింట్లు వృద్ధి చెంది 24,357 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, ఏసియన్ పెయింట్స్, మారుతి సుజుకి, సన్‌ఫార్మా
అంతర్జాతీయ మార్కెట్లు
అమెరికన్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. నిరుద్యోగ క్లెయింలు అంచనాల కంటే తక్కువగా నమోదైనట్లు గణాంకాలు వెల్లడించడంతో అక్కడి సూచీలు మంచి లాభాలను గడించాయి. నేడు ఆసియా-పసిఫిక్ సూచీలు కూడా భారీ లాభాల్లో పయనిస్తున్నాయి. ప్రధానంగా ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ అన్నీ మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, గురువారం విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) నికరంగా రూ.2,627 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.577 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.