తెలంగాణ

telangana

ETV Bharat / business

అదరగొట్టిన స్టాక్ మార్కెట్లు- ఆల్​టైమ్ హై వద్ద ముగిసిన సెన్సెక్స్​ & నిఫ్టీ - stock market live updates today - STOCK MARKET LIVE UPDATES TODAY

stock market live updates today
stock market live updates today (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 2:14 PM IST

Updated : Jun 25, 2024, 3:46 PM IST

Stock Market Live Updates Today :ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ల్ సూచీలు మంగళవారం జీవన కాల గరిష్ఠాన్ని తాకాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 571 పాయింట్లు లాభపడి 77,914 వద్ద లైఫ్​ టైమ్ హై రికార్డ్​ను నమోదు చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 138 పాయింట్లు వృద్ధి చెంది 23,676 వద్ద జీవన కాల గరిష్ఠాలను టచ్​ చేసింది.

లాభపడిన స్టాక్స్​ : యాక్సిస్ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్ర, ఎస్​బీఐఎన్, ఇండస్ ఇండ్ బ్యాంకు, రిలయన్స్, సన్ ఫార్మా, టీసీఎస్, బజాజ్ ఫిన్ జర్వ్, అల్ట్రాసెమ్కో, ఇన్ఫోసిస్

నష్టపోయిన షేర్స్​ : టాటా మోటార్స్, ఐటీసీ, హెచ్​సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, ఏషియన్ పెయింట్, టాటా స్టీల్

ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్ లాభాల్లో ఉండగా, షాంఘై మార్కెట్ నష్టాలను చవిచూసింది. అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి.

LIVE FEED

3:43 PM, 25 Jun 2024 (IST)

Stock Market Live Updates Today :ఆసియా మార్కెట్లలలో సానుకూల పననాలు, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్ ఇండస్ట్రీస్ వంటి స్టాక్స్​లో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం జీవనకాల గరిష్ఠాన్ని తాకి ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 712 పాయింట్లు లాభపడి 78,053 వద్ద లైఫ్​ టైమ్ హై రికార్డ్ వద్ద ముగిసింది. సెన్సెక్స్ 78 వేల మార్కను దాటడం ఇదే తొలిసారి. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 183 పాయింట్లు వృద్ధి చెంది 23,721 వద్ద జీవన కాల గరిష్ఠాలను టచ్​ చేసి స్థిరపడింది.

లాభాల్లో ఉన్న షేర్లు :యాక్సిస్ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్​సెర్వ్, రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, కొటాక్ బ్యాంకు, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంకు

నష్టాల్లో ఉన్న స్టాక్స్ :బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్, టైటాన్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఎన్​టీపీసీ, టాటా స్టీల్

గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో మన దేశ కరెంట్‌ ఖాతా మిగులు 5.7 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇది జీడీపీలో 0.6 శాతానికి సమానమని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్​బీఐ) సోమవారం ప్రకటించింది. స్టాక్ మార్కెట్ల లాభాలకు ఇదొక సానుకూల సంకేతంగా పనిచేసిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్​మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు.

లాభాల్లో ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్ లాభాల్లో స్థిరపడగా, షాంఘై నష్టాల్లో ముగిసింది. యూరప్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.

ముడిచమురు ధర
అంతర్జాతీయ మార్కెట్ ​లో ముడి చమురు ధరలు 0.44 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 85.63 డాలర్లుగా ఉంది.

Last Updated : Jun 25, 2024, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details