తెలంగాణ

telangana

ETV Bharat / business

FY25 స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్​ - ఇన్వెస్టర్లకు లాభమా? నష్టమా? - Stock Market Forecast 2024 25 - STOCK MARKET FORECAST 2024 25

Stock Market Forecast 2024-25 : స్మాల్-క్యాప్ స్టాక్స్ కొన్న పెట్టుబడిదారులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా లాభపడ్డారు. కానీ ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో ఈ స్మాల్​-క్యాప్​ షేర్లు కరెక్షన్​కు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ 50, లార్జ్ క్యాప్​ షేర్లు మాత్రం రాణించే అవకాశం ఉందని చెబుతున్నారు. పూర్తి వివరాలు మీ కోసం.

Indian Stock Market Outlook for FY25
Stock market forecast 2024-25

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 12:37 PM IST

Stock Market Forecast 2024-25 : దేశీయ స్టాక్​ మార్కెట్లు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మంచి లాభాలతో ముగిశాయి. నిఫ్టీ దాదాపు 31 శాతం వరకు లాభపడింది. దీనితో ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన మార్కెట్లలో ఒకటిగా నిఫ్టీ నిలిచింది. ఇండెక్స్ పెర్ఫార్మెన్స్​ కూడా చాలా బాగుంది. గత పదేళ్లలో రెండో అత్యుత్తమ పనితీరును ప్రదర్శించింది. అలాగే నిఫ్టీ 500 స్టాక్స్​లో దాదాపు ఐదో వంతు షేర్లు రెండింతలు లాభపడ్డాయి.

వడ్డీ రేట్లు తగ్గుతాయా?
రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా ఈ ఏడాది రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది మిగతా దేశాల జాతీయ బ్యాంకులు పెంచిన దానికంటే చాలా తక్కువ. అయినప్పటికీ అనుకున్న విధంగానే ద్రవ్యోల్బణాన్ని 2 శాతం నుంచి 6 శాతం మధ్యలోనే ఉంచగలిగింది. ఇది కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపించింది.

అయితే ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో ఆర్​బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తుందో, లేదో చూడాలి. ఒక వేళ ఆర్​బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తే గృహ, వాహన, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు దిగివస్తాయి. ఇది కూడా పరోక్షంగా స్టాక్ మార్కెట్​పై సానుకూల ప్రభావం చూపిస్తుంది.

స్టాక్ మార్కెట్ అంచనాలు
నూతన ఆర్థిక సంవత్సరంలో సైక్లికల్​ సెక్టార్స్ మంచి పనితీరు కనబరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా మెటల్​, ఆయిల్ అండ్ గ్యాస్​, యుటిలిటీస్, బ్యాంకింగ్ రంగాలు బాగా రాణించే అవకాశం ఉంది.

అయితే ఐటీ సెక్టార్​ తేరుకోవడానికి కాస్త సమయం పట్టవచ్చు. కానీ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఐటీ స్టాక్స్​ తేరుకుని మోడరేట్​ వృద్ధిని సాధించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

యాక్సెంచర్ లాంటి ప్రముఖ టెక్​ సంస్థలు ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయం తగ్గవచ్చనే అంచనా వేస్తున్నాయి. అందువల్ల లార్జ్​ క్యాప్​ ఐటీ కంపెనీలు మార్చి త్రైమాసికంలో ఆదాయంలో తగ్గుదలను నమోదు చేయవచ్చు. ఓవరాల్​గా చూసుకుంటే ఐటీ సెక్టార్​ పెర్ఫార్మెన్స్​ అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆటో సెక్టార్​ కాస్త నెమ్మదించవచ్చు. కానీ నిర్మాణాత్మక పోకడలు కొనసాగవచ్చు అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

విదేశీ పెట్టుబడుల సంగతేంటి?
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్​పీఐ) భారతదేశంలో గణనీయమైన స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా ఆటోమోటీవ్​, ఎఫ్​ఎంసీజీ, టెలికమ్యునికేషన్​ రంగాల్లో భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎలా అంటే గత 12 నెలల్లో దేశంలో ఎఫ్​పీఐల పెట్టుబడులు 55 శాతం వృద్ధి చెంది 176 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది భారతదేశ వినియోగ-ఆధారిత రంగాలపై విదేశీ పెట్టుబడిదారులకు పెరుగుతున్న ఆసక్తిని, ఆశావాదాన్ని తెలియజేస్తుంది. భారతీయుల విషయానికి వస్తే, ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి వాళ్లు ఎప్పటిలానే చాలా ఉత్సాహంగానే ఉన్నారు.

డబుల్ డిజిట్ వృద్ధి!
దేశంలో స్థిరమైన ఆదాయ వృద్ధితో పాటు, కీలక వడ్డీ రేట్ల తగ్గింపు జరిగితే, నిఫ్టీ 50 చాలా సులువుగా రెండు అంకెల వృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే బాగా లాభపడిన స్మాల్​-క్యాప్​ స్టాక్స్ కాస్త కరెక్షన్​ను గురై, కన్సాలిడేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది మీరు ఎంచుకున్న స్టాక్ -స్పెసిఫిక్​గా ఉంటుంది.

లోక్​ సభ ఎన్నికల ప్రభావం
దేశీయ మార్కెట్లపై లోక్​ సభ ఎన్నికల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. మీడియాలో వచ్చిన వార్తలు, ప్రీ-పోల్​ సర్వే ఫలితాలు, సెంటిమెంట్లు మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే, వచ్చే ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు, మౌలిక సదుపాయాల కల్పన, చేపట్టే ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ మార్కెట్లను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తాయి.

అయితే ఎన్నికల ఫలితాల అనంతరం దేశీయ స్టాక్​ మార్కెట్ర్యాలీలు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎఫ్​ఎంసీజీ, ఆగ్రోకెమికల్స్, వ్యవసాయ పరికరాల లాంటి రూరల్ సెక్టార్స్​ మంచి వృద్ధి సాధించే అవకాశం ఉంది. అయితే మార్కెట్లో వచ్చే స్వల్ప, దీర్ఘకాలిక ఒడుదొడుకులను తట్టుకునేందుకు, పెట్టుబడిదారులు సిప్​, సరైన అసెట్ అలోకేషన్​ విధానాలను పాటించాల్సి ఉంటుంది.

కీలక వడ్డీ రేట్లు తగ్గుతాయా?
నూతన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశాల షెడ్యూల్​ను ఆర్​బీఐ ప్రకటించింది. దీని ప్రకారం, ఏప్రిల్ 3-5 వరకు మొదటి సమావేశం జరుగుతుంది. అయితే ఈ మీటింగ్​లో కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

దేశంలో చాలా వరకు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసినప్పటికీ, రెపోరేటు తగ్గింపు ఇప్పట్లో లేకపోవచ్చని బ్రోకరేజ్ హౌస్ కోటక్ ఇన్​స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేస్తోంది. ఆహార ధరల ఒత్తిడి తగ్గించడం సహా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలను అనుసరించి, ఆర్​బీఐ మూడో త్రైమాసికంలోనే కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని 'కోటక్​' పేర్కొంది. అయితే ఈ వడ్డీ రేట్ల తగ్గింపు చాలా స్వల్పంగానే ఉండే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఉద్యోగులకు అలర్ట్​ - ఆ డబ్బులు కావాలంటే మరో 2 రోజుల్లో ఇలా చేయాల్సిందే! - LTA Claim Last Date

ఫైనాన్సియల్ డెడ్​లైన్స్​ - మార్చి 31లోగా ఇవి పూర్తి చేయాల్సిందే! - Financial Deadlines In March 2024

ABOUT THE AUTHOR

...view details