Stock Market Today April 19th 2024 :దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. దీనితో వరుస 4 రోజుల నష్టాలకు బ్రేక్ పడింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 599 పాయింట్లు లాభపడి 73,088 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 151 పాయింట్లు వృద్ధి చెంది 22,147 వద్ద ముగిసింది.
2.00 PM :దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 578 పాయింట్లు లాభపడి 73,064 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 153 పాయింట్లు వృద్ధి చెంది 22,149 వద్ద కొనసాగుతోంది.
Stock Market Today April 19th 2024 :వరుసగా ఐదో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ కుదేలవుతున్నాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడం, ప్రపంచ మార్కెట్లపై చాలా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. దీనికి తోడు విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం, ముడి చమురు ధరలు భారీగా పెరుగుతుండడం - దేశీయ మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ఫలితంగా ఇండియన్ మార్కెట్లు గత 5 రోజులుగా భారీగా నష్టపోతున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 378 పాయింట్లు నష్టపోయి 72,110 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 123 పాయింట్లు కోల్పోయి 21,872 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఐటీసీ, హిందూస్థాన్ యూనిలివర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఎస్బీఐ, టీసీఎస్