Stock Market Close March 6th 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమై, భారీ లాభాలతో ముగిశాయి. స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్ టైమ్ హై రికార్డుల వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్, ఐటీ రంగాలు రాణించడం సహా, యూరోపియన్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 408 పాయింట్లు లాభపడి 74,085 వద్ద ఆల్-టైమ్ హైరికార్డుతో స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 177 పాయింట్లు వృద్ధి చెంది 22,474 జీవనకాల గరిష్ఠాల వద్ద ముగిసింది.
- లాభాల్లో కొనసాగున్న షేర్లు : కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీ, రిలయన్స్
- నష్టాల్లో కొనసాగుతున్న షేర్లు : ఎన్టీపీసీ, మారుతి సుజుకి, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, విప్రో, బజాజ్ ఫైనాన్స్
ఆసియా మార్కెట్లు
Asian Markets TodayMarch 6th 2024 :ఏసియన్ మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై భారీ నష్టాలతో ముగిశాయి. హాంకాంగ్ మార్కెట్లు మాత్రమే లాభపడ్డాయి. యూఎస్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ప్రస్తుతానికి యూరోపియన్ మార్కెట్లు మంచి లాభాలతో దూసుకుపోతున్నాయి. ఈ ప్రభావం ఇండియన్ మార్కెట్లపైన పడింది.
విదేశీ పెట్టుబడులు
FIIs Investments In India :స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.574.28 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.