తెలంగాణ

telangana

ETV Bharat / business

SBI షాకింగ్ న్యూస్​​ - సడెన్​గా వడ్డీ రేట్లు పెంపు - ఇకపై మరింత ప్రియంకానున్న లోన్స్! - SBI Raises Lending Rates

SBI Raises Lending Rates : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్​ అయిన ఎస్​బీఐ రుణరేట్లను సవరించింది. ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రేట్లను 0.10 శాతం మేర పెంచినట్లు పేర్కొంది. అంటే ఇకపై ఎస్​బీఐ లోన్స్ తీసుకున్నవారు అధిక ఈఎంఐ భారాన్ని మోయాల్సి వస్తుంది. పూర్తి వివరాలు మీ కోసం.

SBI hikes benchmark MCLR rate
SBI raises lending rates by 5-10 bps across most tenures (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 12:18 PM IST

SBI Raises Lending Rates : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) నిధుల వ్యయం ఆధారిత (MCLR) రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. అన్ని కాల‌ప‌రిమితుల‌పైనా ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల (0.10 శాతం) మేర పెంచినట్లు స్పష్టం చేసింది. స‌వ‌రించిన రేట్లు నేటి (2024 జులై 15) నుంచే అమ‌ల‌వుతాయ‌ని త‌న అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

పెరిగిన వడ్డీ రేట్లు ఇవే!

  • ఏడాది కాల‌వ్యవధి గ‌ల ఎంసీఎల్ఆర్‌ 8.75 శాతం నుంచి 8.85 శాతానికి పెరిగింది.
  • ఆరు నెల‌ల కాల‌వ్యవధి గల ఎంసీఎల్​ఆర్​ 8.65 శాతం నుంచి 8.75 శాతానికి పెరిగింది.
  • రెండేళ్లకు ఎంసీఎల్​ఆర్​ 8.85 శాతం నుంచి 8.95 శాతానికి పెరిగింది.
  • మూడేళ్లకు ఎంసీఎల్​ఆర్​ 8.95 శాతం నుంచి 9 శాతానికి ఎస్‌బీఐ పెంచింది.

ఎంసీఎల్ఆర్‌ ఆధారిత రుణ రేట్లు పెరిగిన నేపథ్యంలో ఎస్​బీఐ బ్యాంక్ రుణాల ఈఎంఐలు మరింత పెరగనున్నాయి. అంటే రుణగ్రహీతలపై అధిక వడ్డీ భారం పడనుంది. ముఖ్యంగా ఎస్‌బీఐ ఆటో రుణాలు ఒక సంవత్సరం, వ్యక్తిగత రుణాలు 2 సంవత్సరాల ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానించి ఉంటాయి. కనుక ఈ ఎస్​బీఐ లోన్లు తీసుకున్నవారికి వడ్డీ భారం మరింత పెరుగుతుంది.

ఎంసీఎల్ఆర్ అంటే ఏమిటి?
ఎంసీఎల్ఆర్ అనేది ఒక ప్రామాణిక‌ రుణ రేటు. నిధుల సేక‌ర‌ణ‌ కోసం బ్యాంకుల‌కు అయ్యే నిర్వహ‌ణ వ్యయం, క్యాష్ రిజ‌ర్వ్​ రేషియో (సీఆర్ఆర్‌), కాల‌ప‌రిమితి, ప్రీమియం సహా మొత్తం వ్యయాలను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొని ఎంసీఎల్ఆర్‌ను లెక్కిస్తారు. సాధారణంగా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే త‌క్కువ‌కు లోన్స్​ అందించే అవ‌కాశం ఉండ‌దు. అయితే వివిధ కాల‌ప‌రిమితుల‌కు (ఓవ‌ర్ నైట్ నుంచి మూడేళ్ల వ‌ర‌కు) ఎంసీఎల్ఆర్ వేర్వేరుగా ఉంటుంది.

స్థిరంగా ఈబీఎల్‌ఆర్‌!
ప్రస్తుతం ఎస్​బీఐ హోమ్ లోన్స్​ను 'ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేట్స్‌' (EBLR) ఆధారంగా ఇస్తోంది. అయితే దీంట్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'ఈబీఎల్‌ఆర్‌' 9.15శాతం + సీఆర్‌పీ + బీఎస్‌పీ వద్ద స్థిరంగా ఉంచింది. ప్రస్తుతానికి ఎస్‌బీఐ గృహ రుణాల వడ్డీ రేట్లు 8.50 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉన్నాయి. రుణ గ్రహీత సిబిల్‌ స్కోర్‌ సహా ఇతర అర్హతలను బట్టి ఇవి మారుతుంటుంది.

జొమాటో & స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ ఫీజులు పెంపు - హైదరాబాద్​లో ఎంతంటే? - Zomato Swiggy Raise Platform Fee

జోరు పెంచుతున్న మారుతి సుజుకి - వరుసగా 12 కార్లు లాంఛ్ చేసేందుకు సిద్ధం! - Upcoming Maruti Cars In India

ABOUT THE AUTHOR

...view details