Reasons For Car Not Starting : ఒక్కోసారి ఏదైనా అర్జంట్ పని మీద బయటకు వెళదామని చూస్తే.. కారు అస్సలే స్టార్ట్ కాదు. దీంతో ఎక్కడలేని చిరాకు వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితి కారు నడిపేవారికి అనుభవమే. ఇలా కారు స్టార్ట్ కాకుండా మొరాయించడానికి ముఖ్యంగా 5 కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
స్టార్టర్ మోటార్‌లో సమస్య :
మీ కారులో బ్యాటరీ సరిగానే పనిచేస్తూ ఉండి, ట్యాంక్‌లో ఫ్యూయల్ ఉన్నప్పుడు కారు స్టార్ట్ అవకపోతే.. సమస్య స్టార్టర్ మోటర్‌లో ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఫ్యూయల్ తక్కువగా ఉన్నప్పుడు :
మీ కారులో ఫ్యూయల్ చాలా తక్కువగా ఉంటే.. ఆయిల్ పంపు ఇంజిన్‌కు తగినంత పెట్రోల్ లేదా డీజిల్‌ను పంపించలేకపోతుంది. ఇలాంటి పరిస్థితి వస్తే కారు స్టార్ట్ అవదని నిపుణులు చెబుతున్నారు. వెహికిల్‌లో ఫ్యూయల్ చెక్ చేసుకోవడానికి డ్యాష్‌బోర్డ్‌లోని ఫ్యూయల్ గేజ్‌ను చెక్ చేయాలని సూచిస్తున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి ఎప్పుడూ కారులో తగినంత ఫ్యూయల్ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా ఫ్యుయల్ పంప్, ఫిల్టర్‌లో సమస్య వచ్చినా కూడా వెహికిల్ స్టార్ట్ కాదని చెబుతున్నారు.
ఈదురు గాలుల వర్షంలో - కారు ఎలా నడపాలో మీకు తెలుసా? - How To Drive car Strong Winds rains
ఫ్యూజులు కాలిపోవడం :
ఒక్కోసారి కారు బ్యాటరీలో ఓవర్‌లోడ్ వల్ల ఫ్యూజ్‌లు కాలిపోతుంటాయి. దీంతో కారు స్టార్ట్ అవదని నిపుణులు చెబుతున్నారు. అలాగే కారు లైట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా పనిచేయకుండా ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి, కారులో ఎల్లప్పుడూ ఐదు ఫ్యూజులు ఉంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఫ్యూజు సాకెట్‌లను శుభ్రంగా ఉంచడం, ఫ్యూజ్ బాక్స్ పాడవకుండా చూడటం వల్ల ఫ్యూజులు కాలిపోకుండా నివారించుకోవచ్చు.
బ్యాటరీ డెడ్ :
మెజార్టీ జనాలు ఎప్పుడూ కారులో పెట్రోల్ లేదా డీజిల్ ఉందా ? లేదా ? అనేది చెక్ చేసుకుంటారు కానీ.. బ్యాటరీ కండీషన్ ఎలా ఉంది అనేది మాత్రం చూసుకోరు! బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయిపోతే వెహికిల్ స్టార్ట్ కాదు. అలాగే.. బ్యాటరీ లైఫ్ అయిపోతే కూడా స్టార్ట్ కాదు. బ్యాటరీ డెడ్ అయిపోతే వెంటనే కొత్తది ఫిక్స్ చేయాలని సూచిస్తున్నారు. బ్యాటరీ త్వరగా డెడ్ అయిపోవడానికి.. వెహికిల్‌రన్నింగ్‌లో లేనప్పుడు లైట్లు, ఇతర పరికరాల ఆన్‌లో ఉండటం ప్రధాన కారణంగా చెబుతున్నారు.
- బ్యాటరీ ఫూర్తిగా డెడ్ అయినప్పుడు కారును స్టార్ట్ చేయడానికి.. పుష్ స్టార్ట్ చేయాలి. అయినప్పటికీ కారు స్టార్ట్ కాకపోతే ఆల్టర్నేటర్‌లో సమస్య ఉన్నట్టు గుర్తించాలని సూచిస్తున్నారు.
- పెట్రోల్‌తో నడిచే కార్లు, బైక్‌లలో ఫ్యూయల్ మండించడానికి స్పార్క్ ప్లగ్ ఉంటుంది. ఒక్కోసారి స్పార్క్ ప్లగ్ పాతబడినా, మురికిగా మారినా కూడా కారు స్టార్ట్ కాదని నిపుణులు చెబుతున్నారు.
- కారు స్టార్ట్ కాకపోతే వెంటనే వీటిని గుర్తించాలి తప్ప.. టెన్షన్ పడడం వల్ల ఉపయోగం లేదని సూచిస్తున్నారు. వీటిలో ఏదైనా సమస్యను గుర్తిస్తే.. మెకానిక్‌ను పిలవాలా? అవసరం లేదా? అనేది మీరు వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆందోళన తగ్గించుకోవడం తోపాటు త్వరగా కారును స్టార్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
మీరు ఆటోమేటెడ్ కారు వాడుతున్నారా? - ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు! - AMT Car Safety Driving Tips
మీ కారు కోసం కొత్త టైర్లు కొనాలా? - ఈ టిప్స్ అస్సలే మరిచిపోవద్దు! - Tips to Choose Right Tyres for Car