తెలంగాణ

telangana

ETV Bharat / business

క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్ - కొత్త రూల్స్ వచ్చేశాయ్​ - మరి మీ బ్యాంక్​ BBPSలో చేరిందా? - RBI New Credit Card Rules - RBI NEW CREDIT CARD RULES

RBI New Credit Card Rules : క్రెడిట్ కార్డు వినియోగదారులూ బీ అలర్ట్. మీ బిల్ పేమెంట్స్‌ను మరింత సెక్యూర్డ్‌గా మార్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. అదే బీబీపీఎస్. ఇందులో మీ క్రెడిట్ కార్డ్ బిల్లర్ సంస్థ చేరిందా? లేదా? అనేది చెక్ చేసుకోండి. ఇంతకీ ఇదేమిటి అనేది తెలుసుకునేందుకు ఈ కథనం చదవండి.

RBI New Credit Card Rules
CREDIT CARDS (ANI/ Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 12:54 PM IST

RBI New Credit Card Rules :మీరు క్రెడిట్ కార్డును వాడుతున్నారా? అయితే తప్పకుండా ఒక కొత్త అప్‌డేట్‌ గురించి తెలుసుకోండి. మీ క్రెడిట్ కార్డులో భారత్ బిల్ పేమెంట్ సర్వీస్ (బీబీపీఎస్) యాక్టివేట్ అయ్యిందా? లేదా? చూసుకోండి. ఇంతకీ 'బీబీపీఎస్' ఏమిటి? దీన్నిక్రెడిట్ కార్డుల్లో ఎందుకు యాడ్ చేశారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బీబీపీఎస్ ఏమిటి? దీని వల్ల ప్రయోజనాలేంటి?
ఆన్‌లైన్ బిల్లుల చెల్లింపు వ్యవహారాలన్నీ ఒక గొడుకు కిందకు తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ పేరే బీబీపీఎస్. దీనిలో అన్ని రంగాల వ్యాపారాలు, బిల్లర్లు, చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్లు, రిటైల్ బిల్ అవుట్‌లెట్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఆన్‌లైన్ బిల్ పేమెంట్ కోసం ప్రతీ ఆర్థిక, వాణిజ్య సంస్థ తప్పకుండా బీబీపీఎస్‌ సర్వీసును తమ ప్లాట్‌ఫామ్‌లలో యాక్టివేట్ చేసుకోవాలి. దీని ద్వారా బిల్ పేమెంట్ చాలా సేఫ్‌గా, పారదర్శకంగా జరుగుతుంది. ఈ క్రమంలో ఏదైనా సమస్య తలెత్తినా, సత్వర పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. బిల్ పేమెంట్స్‌ను బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, ఏటీఎంల ద్వారా చేసే అవకాశాన్ని కూడా బీబీపీఎస్ వ్యవస్థ కల్పిస్తుంది. అంతేకాదు బిల్ పేమెంట్స్‌కు సంబంధించిన గడువు తేదీల గురించి కస్టమర్లకు నోటిఫికేషన్లు వెళతాయి. దీనివల్ల లేట్ పేమెంట్స్ సంఖ్య తగ్గుతుంది. కస్టమర్లకు పెనాల్టీల రిస్క్ తగ్గుతుంది. బీబీపీఎస్ వ్యవస్థ అనేది భద్రతా ప్రోటోకాల్‌లను కలిగి ఉంటుంది. ఇందులో కస్టమర్ల ఆర్థిక డేటా, లావాదేవీల వివరాలు సేఫ్‌గా ఉంటాయి.

15 బిల్లర్లు లైవ్ - క్యూలో మరో ముగ్గురు
క్రెడిట్ కార్డుల విషయానికొస్తే, 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 క్రెడిట్ కార్డు బిల్లర్లు బీబీపీఎస్ ప్లాట్‌ఫామ్‌తో చేతులు కలిపాయి. ఇంకా కొన్ని బ్యాంకుల బిల్లర్లు ఈ దిశగా ప్రాసెస్‌ను మొదలుపెట్టాయి. 2024 జూలై 15 నాటికి బీబీపీఎస్‌లో చేరిన క్రెడిట్ కార్డ్ బిల్లర్ల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, బీఓబీ క్రెడిట్ కార్డ్, కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఐడీబీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండస్​ఇండ్ క్రెడిట్ కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, సరస్వత్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ ఉన్నాయి. ఇక బీబీపీఎస్‌లో చేరే ప్రక్రియను మొదలుపెట్టిన క్రెడిట్ కార్డ్ బిల్లర్ల జాబితాలో యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యస్ బ్యాంక్ ఉన్నాయి.

భారత్ బిల్​పేను ఎలా ఉపయోగించాలి?

  • మీ బ్యాంక్ యాప్/వెబ్‌సైట్ లేదా భారత్ బిల్​పే ప్లాట్‌ఫామ్‌లో లాగిన్ కావాలి.
  • అందులో "బిల్ చెల్లింపు" ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • వెంటనే "భారత్ బిల్​ పే" అనే పేమెంట్ ఆప్షన్ వస్తుంది.
  • బిల్ కేటగిరి, పేరు, బిల్లు రెఫరెన్స్ నంబరును ఎంటర్ చేయాలి.
  • బిల్లు వివరాలను ఒకసారి పూర్తిగా చెక్ చేసుకోవాలి.
  • మీరు చెల్లించాల్సిన అమౌంట్‌ను ఎంటర్ చేయాలి.
  • మీకు ఇష్టమైన చెల్లింపు పద్ధతిని సెలెక్ట్ చేసుకోవాలి.
  • మీరు చేస్తున్న లావాదేవీని ఒకసారి కన్ఫార్మ్ చేయాలి.
  • పేమెంట్​ చేసేటప్పుడు, అలాగే పేమెంట్​ జరిగిన తర్వాత కూడా మీకు భారత్ బిల్‌పే లోగో కనిపిస్తుంది. అంటే మీరు చేసిన పేమెంటు బీబీపీఎస్‌లో నమోదైందన్న మాట.

చాణక్యుడు చెప్పిన ఈ 'బిజినెస్​ స్ట్రాటజీ' పాటిస్తే - విజయం మీ వెంటే! - Chanakya Arthashastra

ఈ కాలేజ్ డ్రాపౌట్స్ 'కోటీశ్వరులు' అయ్యారు - ఎలాగో తెలుసా? - College Dropouts Billionaires

ABOUT THE AUTHOR

...view details