PF Withdrawal From ATMs :పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. త్వరలోనే ఉద్యోగ భవిష్యనిధి సొమ్ము ఉపసంహరణ మరింత తేలిక కానుంది. ఈపీఎఫ్‌ఓ చందాదారులు నేరుగా ఏటీఎంల ద్వారా తమ పీఎఫ్‌ను విత్ డ్రా చేసుకునే అవకాశం త్వరలోనే కల్పించనున్నట్లు కార్మికశాఖ కార్యదర్శి సుమిత దావ్రా వెల్లడించారు. కార్మికులకు మెరుగైన సేవల కోసం కార్మిక మంత్రిత్వ శాఖ తన ఐటీ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తోందని ఆయన అన్నారు. క్లెయిమ్‌లు వేగంగా పరిష్కరిస్తున్నామన్న ఆమె - చందాదారులు, లబ్ధిదారులు ఏటీఎంల ద్వారా నగదును సులభంగా పొందవచ్చని అన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచే ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్- ATM ద్వారా నగదు విత్‌డ్రా!
ఏటీఎం ద్వారా పీఎఫ్ నగదు విత్‌డ్రా - 2025 జనవరి నుంచే!
PF Withdrawal From ATMs (Getty Images)
Published : 6 hours ago
"చందాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి ఇందులో పురోగతి గమనించవచ్చు. జనవరి 2025 నాటికి మరిన్ని మార్పులు వస్తాయని ఆశిస్తున్నాను" అని కార్మికశాఖ కార్యదర్శి సుమిత దావ్రా పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో సేవలను మరింత మెరుగుపరచడం సహా, ఖాతాదారుల జీవన సౌలభ్యాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.