తెలంగాణ

telangana

ETV Bharat / business

పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలా? - ఓవర్‌ డ్రాఫ్టా? - ఏది మంచిదో తెలుసా? - Overdraft details

Personal Loans Vs Overdraft Which Is Best : డబ్బులు అత్యవసరమైతే.. పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలా? ఓవర్‌ డ్రాఫ్ట్​కు వెళ్లాలా? అనే విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు. ఏదో ఒకటిలే అని ముందుకెళ్తారు. అయితే.. మీరు చేస్తున్న పనిబట్టి మీకు ఏది మంచిదో తెలుసుకోవాలని చెబుతున్నారు నిపుణులు!

Personal Loans Vs Overdraft Which Is Best
Personal Loans Vs Overdraft Which Is Best

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 1:43 PM IST

Personal Loans Vs Overdraft Which Is Best :ఈ రోజుల్లో బ్యాంకుల నుంచి లోన్స్ ఈజీగానే లభిస్తుండడంతో.. చాలా మంది పర్సనల్‌ లోన్స్‌ తీసుకుంటున్నారు. మరికొందరు తమ అకౌంట్​ ద్వారా ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. మరి, మీ అవసరాలకు అనుగుణంగా పర్సనలోన్‌ తీసుకోవడం మంచిదా? లేక ఓవర్‌ డ్రాఫ్ట్‌ను ఎంచుకోవడం మంచిదా? అన్నది మీకు తెలుసా?

పర్సనల్ లోన్‌ అంటే?
బ్యాంకులు ఎలాంటి తనఖా లేకుండా నిర్దిష్ట కాలానికి, నిర్దిష్ట వడ్డీ రేటుతో అప్పు ఇవ్వ‌డాన్నే 'పర్సనల్ లోన్‌' అంటారు. ఎటువంటి ష్యూరిటీ లేకుండానే ఈ లోన్‌ వస్తుంది. ఈ లోన్‌ తీసుకున్న తర్వాత ప్రతినెలా చెప్పిన సమయానికి EMI చెల్లించాలి. చెప్పిన తేదీన తప్పకుండా మంథ్లీ ఇన్​స్టాల్​ మెంట్ చెల్లించాలి. అదే సమయంలో.. లోన్ టెన్యూర్‌ కంటే ముందే మీరు పూర్తి అమౌంట్‌ చెల్లించాలనుకుంటే బ్యాంకు పెనాల్టీ కూడా విధిస్తుంది.

  • ఈ లోన్‌ ద్వారా ఒకేసారి మనకు మొత్తం రుణాన్ని అందజేస్తారు.
  • వడ్డీ అనేది నెలవారీగా లెక్కిస్తారు.
  • ఇది సాధారణంగా 2 నుంచి 5 సంవత్సరాల వరకు ఉండవచ్చు.
  • రుణం ఇచ్చే సమయంలో EMI రీపేమెంట్ షెడ్యూల్ ఉంది.

ఓవ‌ర్ డ్రాఫ్ట్ అంటే ?
ఓవ‌ర్ డ్రాఫ్ట్ అనేది నిర్దిష్ట వడ్డీ రేటుతో నిర్దిష్ట కాలపరిమితికి బ్యాంక్‌ అందించే క్రెడిట్‌ లైన్‌. మీకు డబ్బులు అవసరమున్నప్పుడు ఈ ఓవ‌ర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని బ్యాంకు అధికారులతో ఆమోదింప చేసుకుని ఉపయోగించుకోవచ్చు. మీరు ఒకవేళ తీసుకున్న డబ్బులను ఒకేసారి చెల్లించాలనుకుంటే చెల్లించవచ్చు. ముందస్తుగా డబ్బులను చెల్లిస్తే ఎటువంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు ఎన్ని రోజులు డబ్బులను వాడుకున్నారో అన్ని రోజులకు వడ్డీ రేటును నిర్ణయిస్తారు.

  • బ్యాంక్ విధించిన లిమిట్‌ లోపు ఓవ‌ర్ డ్రాఫ్ట్ పొందవచ్చు.
  • స్థిరమైన రీపేమెంట్ షెడ్యూల్ లేదు.
  • సాధారణంగా ఓవ‌ర్ డ్రాఫ్ట్ ఒక సంవత్సరంలోపు ఉండవచ్చు.

ఏది మంచిది ?

  • మీకు డబ్బు ఎంత అవసరం ఉందన్నది ముందుగా నిర్ధారించుకోండి.
  • తీసుకునే మొత్తాన్ని ఎప్పటిలోపు తిరిగి చెల్లిస్తామనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉండాలి.
  • ఇలాంటి వారు.. పర్సనల్‌ లోన్‌ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
  • ఇంటిని రిపేర్‌ చేయించాలనుకుంటే పర్సనల్‌ లోన్‌ తీసుకోవచ్చు.
  • అలాగే మొబైల్‌, ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలంటే పర్సనల్‌ లోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌.
  • అలా కాకుండా.. మీకు డబ్బు ఎంత వరకు అవసరం ఉందో తెలియట్లేదు.. అలాగే ఎప్పుడు చెల్లిస్తామో కూడా క్లారిటీ లేదు అనుకున్నప్పుడు ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
  • ఉదాహరణకు మీకు మెడికల్‌ ఎమర్జెన్సీ ఉందనుకోండి.. అప్పుడు హాస్పిటల్‌ ఖర్చులు ఎంత ఉంటాయో.. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని ఖర్చులు ఉంటాయో.. తిరిగి ఎప్పుడు చెల్లిస్తామో తెలియదు.
  • ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఓవర్‌డ్రాఫ్ట్ వైపు వెళ్లడం మంచిదని నిపుణులంటున్నారు.
  • అప్పుడు మీకు అవసరం ఉన్నంత మేరకు డబ్బులను వాడుకోవచ్చు.

చివరిగా..

  • మీరు నెలనెలా జీతంపై ఆధారపడి జీవించే వారైతే పర్సనల్‌ లోన్‌ తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
  • ఒకవేళ మీరు వ్యాపారం వంటివి ఏదైనా చేస్తుంటే ఓవర్‌డ్రాఫ్ట్ వైపు వెళ్లడం మంచిదని నిపుణులంటున్నారు.
  • డబ్బుల విషయంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలియదు కాబట్టి.. పై సూచనలు పాటిస్తూ మీరు అవసరాన్ని బట్టి ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

సిబిల్ స్కోర్ తగ్గకుండా క్రెడిట్ కార్డు క్యాన్సిల్ - ఈ టిప్స్ పాటించండి!

మీ అకౌంట్​లో బ్యాలెన్స్ జీరోనా? - అయినా డబ్బులు విత్​డ్రా చేసుకోవచ్చు!

ఫిక్స్​డ్​ డిపాజిట్లపై లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details