Noel Tata Appointed Chairman Of Tata Trusts :టాటా గ్రూప్‌నకు చెందిన దాతృత్వ విభాగం టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా నోయెల్ టాటా నియమితులయ్యారు. అక్టోబర్ 11న ముంబయిలో జరిగిన సమావేశంలో ఆయన నియామకం ఏకగ్రీవంగా జరిగిందని సమాచారం. రతన్ టాటా మరణించిన నేపథ్యంలో ఆయన టాటా ట్రస్ట్స్ పగ్గాలు చేపట్టారు.
ఘనమైన వారసత్వం
రతన్ టాటాకు నోయెల్ టాటా సవతి సోదరుడు అవుతారు. ఆయన 2014 నుంచి ట్రెంట్ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ రిటైల్ దుస్తుల వ్యాపారన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు కూడా. గత దశాబ్ద కాలంలో నోయెల్ హయాంలో సదరు కంపెనీ షేర్ విలువ 6000 శాతం పెరిగింది. దీనిని బట్టి అతని వ్యాపార దక్షత ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇప్పటి వరకు టాటా ట్రస్టులు అన్నింటినీ రతన్ టాటానే చూసుకునేవారు. కానీ ఆయన తన తరువాత ఎవరు వీటిని నడపాలో చెప్పకుండానే 86 ఏళ్ల వయస్సులో మరణించారు. దీనితో రతన్ టాటా ఎప్పుడూ చెప్పే 'ముందుకు వెళ్తూనే ఉండాలి' (Moving On) విధానాన్ని అనుసరించి, టాటా గ్రూప్ నోయెల్ టాటాను టాటా ట్రస్టులకు ఛైర్మన్‌గా నియమించింది.