తెలంగాణ

telangana

ETV Bharat / business

SBI @23,000 బ్రాంచ్​లు- దేశంలోని అతి పెద్ద బ్యాంక్​ గురించి ఈ విషయాలు తెలుసా? - SBI NEW BRANCHES

ఎస్​బీఐ కీలక నిర్ణయం - కొత్తగా మరో 500 బ్రాంచ్​లు ఏర్పాటు

SBI New Branches
SBI New Branches (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2024, 5:34 PM IST

SBI New Branches : దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) తమ వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు సిద్ధమవుతోంది. మారు మూల ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో 500 శాఖలను ప్రారంభించినున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో బ్యాంకు బ్రాంచ్​ల సంఖ్య 23వేలకు చేరుతుందన్నారు. ముంబయిలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం 100వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. అంతేకాకుండా రూ.100 స్మారక నాణెం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్​బీఐ గురించి కొన్ని కీలక విషయాలు తెలుసుకుందాం.

ఎస్​బీఐ గురించి కీలక విషయాలు

  • బ్యాంక్ ఆఫ్​ కలకత్తా(1806), బ్యాంక్ ఆఫ్​ బాంబే(1840), బ్యాంక్ ఆఫ్​ మద్రాస్(1843) మూడు బ్యాంకులను కలిపి 1921 జనవరి 27న ఇంపీరియల్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాగా(ఐబీఐ) ఏర్పాటు చేశారు.
  • 1955లో పార్లమెంట్​లో చట్టం చేసి ఇంపీరియల్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాను స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియాగా మార్చారు.
  • ప్రస్తుతం ఎస్​బీఐ భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్​గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 48వ అతిపెద్ద బ్యాంక్​గా ఉంది.
  • ఎస్​బీఐ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. 1924లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా ప్రధాన శాఖగా ముంబయిలో ఏర్పాటు చేశారు. తర్వాత ఎస్​బీఐ ప్రధాన కార్యాలయంగా కొనసాగించారు.
  • 1921లో 250 బ్రాంచ్​లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 22,500కు చేరింది.
  • ప్రసుత్తం ఎస్​బీఐకి 50 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు.
  • దేశవ్యాప్తంగా 6580 ఎస్​బీఐ ఏటీఎంలు, 85 వేల బ్యాకింగ్ కరస్పాండెంట్లు ఉన్నారు.
  • 25 శాతం డెబిట్ కార్డ్, 22 శాతం మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు , 25 శాతం యూపీఐ లావాదేవీలు , 29 శాతం ఏటీఎం ట్రాన్సాక్షన్లు ఎస్​బీఐ ద్వారానే జరుగుతున్నాయి.
  • దేశంలోని మొత్తం డిపాజిట్లలో ఎస్​బీఐ వాటా 22.4 శాతంగా ఉంది.
  • ఎస్​బీఐ రోజుకు 20 కోట్ల యూపీఐ లావాదేవీలను నిర్వహిస్తుంది.
  • ఇటీవల క్యూ2 ఫలితాల్లో రూ.19వేల కోట్ల లాభాన్ని నమోదు చేసింది.
  • ప్రస్తుతం దేశంలో 43 ఎస్‌బీఐ బ్రాంచీలు శతాబ్దం చరిత్ర కలిగినవే.

ABOUT THE AUTHOR

...view details