తెలంగాణ

telangana

ETV Bharat / business

సూపర్ ఫీచర్స్​తో అదిరిపోయే ఎలక్ట్రిక్ కార్లు- నయా EV కార్స్ ఇవే! - NEW EV CAR LAUNCHES IN 2025

భారత మార్కెట్​లో త్వరలో విడుదల కానున్న కొత్త ఈవీ కార్లు ఇవే!

New EV Car Launches In 2025
New EV Car Launches In 2025 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2025, 4:25 PM IST

Updated : Jan 3, 2025, 4:44 PM IST

New EV Car Launches In 2025 : ప్రయాణం చాలా మందికి ప్రత్యేకమైన అనుభూతి. ఈ కొత్త సంవత్సరంలో సరికొత్తగా ప్రయాణం చేసేందుకు సిద్ధమవుతుంటారు. అందుకే వాహన తయారీ సంస్థలు కూడా ప్రయాణికుల అభిరుచులకు తగ్గట్లుగా వివిధ మోడల్స్​ను ఏడాది ప్రారంభంలోనే తెస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్​ నడుస్తోంది కాబట్టి మార్కెట్​లో త్వరలో విడుదల కానున్న కొత్త ఈవీ కార్లు, మెడల్స్​ ఏంటో చూసేద్దాం పదండి.

మారుతి సుజుకీ ఇ-విటారా
Maruti Suzuki e Vitara : ఈ ఏడాది విడుదల కానున్న కార్లలో మారుతి సుజుకీ ఇ-విటారా చాలా ముఖ్యమైనది. జనవరి 17-22 వరకు జరగనున్న 'భారత్​ మొబిలిటీ షో 2025' లో ఈ కార్​ను రిలీజ్ చేయనున్నారు. ఇంతకుముందు సంస్థ ప్రకటించిన eVX కాన్సెప్ట్​నకు చాలా దగ్గరగా ఈ కారు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయినా చాలా శక్తిమంతంగా, రగ్​డ్​ లుక్​లో ఉన్నట్లు సమాచారం. ఈ కారు 49kWh (144hp పవర్), 61kWh (184hp పవర్) సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్​లతో వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇ-విటారాలో ఆప్షనల్​గా డ్యూయల్-మోటార్ ఆల్​ వీల్​ డ్రైవ్- AWD వ్యవస్థ కూడా పొందుపర్చినట్లు సమాచారం. అయితే ఈ విద్యుత్​ కారు రేంజ్​పై మాత్రం కంపెనీ ఇంతవరకు అధికారికి ప్రకటన చేయలేదు. 61kWh బ్యాటరీతో గ్లోబర్​ టెస్ట్​ సైకిల్స్​లో 500 కిలోమీటర్ల కంటే ఎక్కు రేంజ్ ఇచ్చిందని తెలుస్తోంది.

హ్యుందాయ్ క్రెటా ఈవీ
Hyundai Creta EV : భారత్​ మొబిలిటీ షో 2025లో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్​ క్రెటా ఇవీని ప్రదర్శించనుంది. మారుతి సుజుకీ ఇ-విటారాకు పోటీగా హ్యూందాయ్​ ఈ మోడల్​ను మార్కెట్​లోకి విడుదల చేయనుంది. క్రెటా ఈవీని అడాప్టెడ్ వెర్షన్ ICE ప్లాట్​ఫామ్​పై తయారు చేస్తున్నారు. దాదాపు పాత క్రెటా లాగానే ఉంటుంది. కానీ ఈవీ కార్లకు ఉండాల్సిన కొన్ని ప్రత్యేక డిజైన్​ అప్డేట్స్​ ఉంటాయి. అయితే ఈ కారు క్యాబిన్​- ఆల్కజార్ ఫేస్​లిఫ్ట్​, కోన(విదేశీ మార్కెట్లలో లభ్యమయ్యే కారు) కార్లకు చాలా దగ్గరగా ఉండనున్నట్లు సమాచారం. ఈ క్రెటా ఈవీ 45kWh బ్యాటరీ, ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్​తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారు సింగిల్ ఛార్జ్​తో 400కిలోమీటర్లు రేంజ్ ఇస్తుందని సమాచారం.

ఎమ్​జీ సైబర్​స్టర్
MG Cyberster :ఎమ్​జీ సెలెక్ట్​ రిటైల్​ ఛానల్ ద్వారా సైబర్​స్టర్ స్పోర్ట్స్​​ కార్లను సంస్థ విక్రయించనుంది. త్వరలో జరగబోయే భారత్​ మొబిలిటీ షోలో ఈ కారు ధర వివరాలను కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది. రెండు డోర్లతో వచ్చే ఈ కారులో 77kWh బ్యాటరీని పొందుపర్చారు. ప్రతి యాక్సిల్​కు రెండు మోటార్లు అమర్చి ఉన్న ఈ కారు AWD సెటప్​తో వస్తోంది. ఈ సైబర్​స్టర్ 510hp పవర్, 725Nm టార్క్​ ఉత్పత్తి చేసే ఈ కారు 3.2 సెకన్లలో 0-100kph వేగాన్ని అందుకుంటుందని సమాచారం. అంతేకాకుండా చైనా లైట్-డ్యూటీ వెహికిల్ టెస్ట్​ సైకిల్-CLTCలో ఈ కారు 580కిలోమీటర్ల రేంజ్ ఇచ్చిందని ఎమ్​జీ చెబుతోంది.

మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ
Mahindra BE 6 and XEV 9e :మహీంద్రా నుంచి వస్తున్న 'సుపర్​ క్లాస్'​ ఈవీ కార్లు బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ. ఈ రెండు కార్ల ధరలను కంపెనీ ఇదివరకే ప్రకటించింది. అయితే త్వరలో జరగబోయే మొబిలిటీ షోలో ఈ ఎస్​యూవీల ఫుల్​ ప్రైజ్​ లిస్ట్​ను మహీంద్రా ప్రకటించనుంది. ఈ కార్లు INGLO ఈవీ ప్లాట్​ఫామ్​పై తయారయ్యాయి. కాన్సెప్ట్​ కార్ల లాగా వీటిని డిజైన్ చేశారు. రెండు కార్లు 228hp పవర్​ ఉత్పత్తి చేసే 59kWh బ్యాటరీ ప్యాక్​తో వస్తున్నట్లు తెలుస్తోంది. సింగిల్​ ఛార్జ్​లో బీఈ-6 556కిలోమీటర్లు, ఎక్స్ఈవీ 9ఈ 542కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.

మెర్సిడిస్ జీ 580 EQ
Mercedes G 580 with EQ Technology :ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడిస్ బెంజ్ సరికొత్త ఎలక్ట్రిక్ జీ క్లాస్ కారు జీ-580ను త్వరలో విడుదల చేయనుంది. భారత్​ మొబిలిటీ షోలో కాకుండా జనవరి 9న జరిగే ప్రత్యేక ఈవెంట్​లో ఈ కారును లాంఛ్​ చేయనున్నట్లు సమాచారం. ఈ కారు ICE-పవర్డ్​ జీ-క్లాస్ కారు డిజైన్​కు చాలా దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ కారు ఆఫ్​-రోడింగ్ అబిలిటీని మరింత మెరుగుపరిచినట్లు కంపెనీ చెబుతోంది. జీ-580 కారు మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తోంది. 116kWh బ్యాటరీతో 587hp పవర్, 1165Nm టార్క్​ ఉత్పత్తి చేసే ఈ కారు, కేవలం 5 సెకన్లలో 0-100kph వేగాన్ని అందుకుంటుందని సమాచారం. EQ (Electric Intelligence) టెక్నాలజీతో వస్తున్న ఈ కారు సింగిల్ ఛార్జింగ్​లో 470కిలోమీటర్లు రేంజ్​ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మెర్సిడిస్ EQS ఎస్​యూవీ నైట్ ఎడిషన్
Mercedes EQS SUV Night Edition :జీ క్లాస్​ ఎలక్ట్రిక్ కారు కాకుండా మెర్సిడిస్​-బెంజ్ ​EQS ఎస్​యూవీల్లో మరో రెండు కొత్త వేరియంట్లను లాంఛ్​ చేయనుంది. మేబ్యాక్ నైట్ ఎడిషన్​, EQS 450(5 సీటర్ వేరియంట్) కార్లను మార్కెట్​లోకి తీసుకురానుంది. మేబ్యాక్ నైట్​ ఎడిషన్ కారులో EQS 680 స్పెసిఫికేషన్స్​ ఉన్నారు. టూ టోన్​ బ్లాక్​ కలర్​లో ఎక్స్​టీరియర్​ను డిజైన్​ చేశారు. ఇదిలా ఉండగా EQS 450 కారులో పొందుపర్చిన 122kWh సామర్థ్యం గల బ్యాటరీ 544hp పవర్, 58Nm టార్క్​ ఉత్పత్తి చేస్తుంది.

మరోవైపు, ఈ కార్లు మాత్రమే కాకుండా మరికొన్ని కార్లు కూడా భారత్​ మొబిలిటీ షోలో తొలిసారి ప్రదర్శితమవుతున్నాయి. అందులో సరికొత్త స్కోడా కోడియాక్, స్కోడా సూపర్బ్, హ్యుందాయ్ ఐయోనిక్ 9, స్కోడా ఎల్​రాక్, కియా సిరోస్, బీఎమ్​డబ్ల్యూ X3 వంటివి ఉన్నాయి.

Last Updated : Jan 3, 2025, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details