Microsoft Developer Program In India :మైక్రోసాఫ్ట్ 'కోడ్ వితౌట్ బ్యారియర్స్' ప్రోగ్రామ్‌ను భారత్‌కు కూడా విస్తరించనున్నట్లు ఆ సంస్థ చీఫ్ సత్య నాదెళ్ల ప్రకటించారు. 2024లో భారత్‌లో 75,000 మంది మహిళా డెవలపర్లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో భాగంగా బెంగళూరులో 1100 మంది డెవలపర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు సత్య నాదెళ్ల. భారత్‌కు ఈ ప్రోగ్రామ్‌ను విస్తరిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నట్లు చెప్పారు.
ఈ నెలలోనే భారత్‌కు!
అయితేభారత్కు ఈ నెలలలోనే 'కోడ్ వితౌట్ బ్యారియర్స్' ప్రోగ్రామ్‌ను మైక్రోసాఫ్ట్ సంస్థ విస్తరించనున్నట్లు తెలుస్తోంది. తొమ్మిది ఆసియా పసిఫిక్ దేశాల్లో వేగంగా క్లౌడ్, ఏఐ రంగాల్లో లింగ బేధాలను తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని 2021లో ప్రారంభించింది మైక్రోసాప్ట్. భారత్‌లో మహిళా డెవలపర్లతోపాటు కోడర్లకు శిక్షణ అందిస్తుందీ కార్యక్రమం. ఇతర టెక్నికల్ రోల్స్‌లో ఉన్నవారికి సమగ్ర ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది.
20 లక్షల మందికి ఏఐ శిక్షణ
బుధవారం ముంబయిలో కోసం డేటాసెట్స్ రూపొందించే సంస్థ సమావేశంలో పాల్గొన్న సత్య నాదెళ్ల మరో ప్రకటన చేశారు. భారత్‌లో 2025 కల్లా 20 లక్షల మందికి కృత్రిమ మేధలో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. "ఏఐ శక్తిమంతమైన కొత్త సాంకేతికత. దాని గురించి ఆందోళన చెందకుండా ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరింపచేయాలి. ఇందుకు అనుసరించాల్సిన విధివిధానాలు రూపొందించడంలో భారత్- అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ భాగస్వామ్యం ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది" అని తెలిపారు.
ఓపెన్ ఏఐతో కలిసి మైక్రోసాఫ్ట్ పరిశోధనలు
ఇటీవలే మైక్రోసాఫ్ట్ కంపెనీ కీలక మైలురాయిని దాటింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు ట్రిలియన్ డాలర్లు దాటిన రెండో కంపెనీగా అవతరించింది. గత కొంతకాలంగా ఓపెన్ ఏఐతో కలిసి మైక్రోసాఫ్ట్ ఏఐపై పరిశోధనలు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త టూల్స్‌ను ఆవిష్కరిస్తోంది. మరోవైపు ఫిబ్రవరి 4కు సత్య నాదెళ్ల కంపెనీ సీఈవో బాధ్యతలు చేపట్టి పదేళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆయన సంస్థ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.