తెలంగాణ

telangana

ETV Bharat / business

25KMPL మైలేజ్​, స్టన్నింగ్స్​ లుక్స్, అదిరే​​ ఇంటీరియర్స్- సుజుకి స్విఫ్ట్​ 2024 సూపర్ ఫీచర్స్​ ఇవే! - Maruti Suzuki Swift 2024 Model - MARUTI SUZUKI SWIFT 2024 MODEL

Maruti Suzuki Swift 2024 Model : దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుంచి వస్తున్న సరికొత్త స్విఫ్ట్​ Z సిరీస్​ కార్ల బుకింగ్స్​ ప్రారంభమయ్యాయి. ఈ సరికొత్త మోడల్​లో మరిన్ని ఎక్కువ అప్డేట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి స్విఫ్ట్ Z సిరీస్​లోని మైలేజీ, ఇంజిన్, ఫీచర్లు గురించి తెలుసుకుందాం.

Maruti Suzuki Swift 2024 Model
Maruti Suzuki Swift 2024 Model (GettyImages)

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 5:34 PM IST

Maruti Suzuki Swift 2024 Model :ప్రముఖ కార్ల తయారీదారు సంస్థ మారుతి సుజుకి సరికొత్త స్విఫ్ట్ Z​ సిరీస్ మోడల్ బుకింగ్స్ బుధవారం ప్రారంభమయ్యాయి. ఫోర్త్ జనరేషన్ హ్యాచ్ బ్యాక్ కారుగా మార్కెట్లోకి ప్రవేశించిన మారుతి స్విఫ్ట్ గురించి ఇప్పటికే అనేక లీకుల ద్వారా పలు వివరాలు నెట్టింట హల్​చల్ చేస్తున్నాయి. ఆ వివరాల ప్రకారం ఈ సరికొత్త Z సిరీస్ మోడల్​లో ఇంజిన్ పవర్, టార్క్, ఫ్యూయల్-ఎఫీషియన్సీ వంటివి అప్డేట్​ అయ్యాయి. అలాగే టాప్- స్పెక్ వేరియంట్‌లో సేఫ్టీ కిట్‌ కూడా అందిస్తున్నారు.

ఇక ఈ సరికొత్త మారుతి స్విఫ్ట్ ఒక లీటరు పెట్రోలుకు గానూ 25.72 కిలో మీటర్లు మైలేజీ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త మోడల్ 1.2-లీటర్ Z12E ఇంజిన్​తో వస్తోంది. 82hp పవర్ 112Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ కొత్త స్విఫ్ట్ అన్ని వేరియంట్‌లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి.

కొత్త మారుతి స్విఫ్ట్ ఇతర స్పెసిఫికేషన్లు ఇవే
కొత్త స్విఫ్ట్ Z సిరీస్ ఇంజిన్ గత k సిరీస్ కన్నా కూడా మరింత సమర్థంగా పనిచేస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. ఈ మోడల్​ గత k సిరీస్ కన్నా 3 కిలోమీటర్లు కంటే ఎక్కువ మైలేజీ అందిస్తుందట. దీంతో పాటు కొత్త స్విఫ్ట్ CNG వెర్షన్ త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ Z సిరీస్​ కార్లలో ఇంటీరియర్​ మార్చేసింది కంపెనీ. బాలెనో, ఫ్రాంక్స్ కార్లలో ఉన్నట్లు ఇంటీరియర్స్​ డిజైన్​ చేసింది. అయితే ఈ మోడల్​ ఎలక్ట్రిక్​ పార్కింగ్​ బ్రేక్​ ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై కంపెనీ అధికారికంగా స్పందించలేదు. అయితే 360 డిగ్రీ కెమెరా ఆప్షన్​ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కొత్త మారుతి స్విఫ్ట్ ఫీచర్లు, సేఫ్టీ కిట్
స్విఫ్ట్ అవుట్‌గోయింగ్ మోడల్ కంటే ఈ z సిరీస్​ కారులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి. 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, వెనుక సీట్లకు AC, C-టైప్ USB పోర్ట్‌లతో ఈ కారులో పొందుపర్చారు. సేఫ్టీ కిట్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసింది కంపెనీ. హై ఎండ్ వేరియంట్‌ కార్లలో LED ఫాగ్ లైట్లను కూడా అమర్చారు.

మారుతి, టాటా కార్లపై భారీ ఆఫర్స్​ - ఆ మోడల్​పై ఏకంగా రూ.1.50 లక్షలు డిస్కౌంట్​! - Car Discounts In April 2024

నితిన్ గడ్కరీ మాస్టర్ ప్లాన్​- అదే జరిగితే ఒకేసారి రూ.5.5లక్షలు తగ్గనున్న కార్ల ధరలు! - Hybrid Car Tax Reduction

ABOUT THE AUTHOR

...view details