Maruti Suzuki Swift 2024 Launch :ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ స్విఫ్ట్ నూతన మోడల్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకురానుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్ మోడల్‌పై ఇప్పటికే చాలా బజ్ ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ 2024 మోడల్ కారు లాంఛ్‌కు ముందే ప్రీ బుకింగ్‌ను ప్రారంభించింది. రూ.11 వేల టోకెన్ అమౌంట్‌తో ఆన్లైన్లో లేదా మారుతీ సుజుకీ ఎరీనా డీలర్షిప్ షోరూమ్స్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. కాగా, ఈ మోడల్ కారు మే 9న మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం మారుతీ సుజుకీ స్విఫ్ట్ కారు ఫీచర్లు, తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మారుతీ సుజుకీ స్విఫ్ట్ కారును మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందిన ఒక ఐకానిక్ బ్రాండ్‌గా అభివర్ణించారు ఆ కంపెనీ ఇండియా విభాగం మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ. 'మారుతీ సుజుకీ స్విఫ్ట్‌కు 29 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఈ కారు అనేక అవార్డులు, ప్రశంసలు అందుకుంది. స్విఫ్ట్ 2024 మోడల్ కారు స్పోర్టీ లుక్‌లో ఉంటుంది. ఇది తక్కువ ఉద్గారాలను విడుదల చేసి పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. స్విఫ్ట్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో కొత్త బెంచ్ మార్క్‌లను సెట్ చేస్తుంది' అని తెలిపారు.