Kia Syros SUV Unveiled in India:దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా తన కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. 'సైరాస్' పేరుతో కంపెనీ దీన్ని పరిచయం చేసింది. జనవరి 3వ తేదీ నుంచి దీని బుకింగ్స్ ప్రారంభం కానున్నాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి నుంచి డెలివరీలు మొదలవుతాయని పేర్కొంది.
కియా ఇండియా ఈ కారును అద్భుతమైన డిజైన్, ఆకర్షణీయమైన లుక్‌తో తీసుకొచ్చింది. అంతేకాక దీనిలో కొన్ని సరికొత్త, ప్రీమియం ఫీచర్లను చేర్చింది. వీటిని కంపెనీకి చెందిన ఏ ఇతర SUV లేదా సబ్-4 మీటర్ సెగ్మెంట్ మోడల్స్‌లోనూ అందించలేదు. ఈ కారు పవర్‌ట్రెయిన్ మాత్రం ప్రస్తుతం ఉన్న కియా సోనెట్ మాదిరిగానే పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది.
Kia Syros Front Profile (Photo Credit- Kia India) ట్రిమ్స్:
కంపెనీ ఈ కారును ఆరు ట్రిమ్ ఆప్షన్లలో అందిస్తుంది.
- HTK
- HTK (O)
- HTK+
- HTX
- HTX+
- HTX+ (O)
ఈ కొత్త కియా సైరాస్ బుకింగ్స్ బుకింగ్ జనవరి 3, 2025 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. అయితే ప్రస్తుతం వీటి ధరలపై ఎలాంటి సమాచారం అందించలేదు. త్వరలో ధరను ప్రకటించే అవకాశం ఉంది. వీటి డెలివరీలు మాత్రం ఫిబ్రవరి 2025 నుంచి ప్రారంభంకానున్నాయి.
డిజైన్:కియా ఈ సైరాస్కు సాధారణ బాక్సీ SUV డిజైన్‌ను అందించింది. ఈ డిజైన్‌ను కంపెనీకి చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్ SUV EV9 నుంచి తీసుకున్నారు. దీని ముందు భాగంలో నిలువుగా పేర్చిన 3-ప్యాడ్ LED హెడ్‌లైట్లు, LED డీఆర్ఎల్స్ ఉన్నాయి. ఈకారు సైడ్ ప్రొఫైల్‌లో లార్జ్ విండో ప్యానెల్స్, సి-పిల్లర్‌కు సమీపంలో కింక్డ్ బెల్ట్‌లైన్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అందించారు.
Kia Syros Side Profile (Photo Credit- Kia India) ఈ కారు షోల్డర్ లైన్, ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉంది. ఈ డోర్ హ్యాండిల్స్‌తో మార్కెట్లోకి తీసుకొచ్చిన కంపెనీ లైనప్‌లో మొదటి ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) మోడల్ ఇదే. ఇందులో మరొక ప్రత్యేకత ఏంటంటే.. బాడీ కలర్లో యునిక్ డిజైన్‌తో B-పిల్లర్ డోర్ పిల్లర్ ఎలిమెంట్ ఉంది. ఇక ఈ కారు వెనక వైపున సొగసైన L-షేప్డ్ LED టైల్‌లైట్లు, ఫ్లాట్ టెయిల్‌గేట్ ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్:
- ఇంటెన్స్ రెడ్
- ఫ్రాస్ట్ బ్లూ
- ప్యూటర్ ఆలివ్
- ఆరా బ్లాక్ పెరల్
- గ్రావిటీ గ్రే
- ఇంపీరియల్ బ్లూ
- గ్లేసియర్ వైట్ పెరల్
- స్పార్కింగ్ సిల్వర్
ఇంటీరియర్:కియా సైరాస్ ఇంటీరియర్ విషయానికొస్తే.. ఇందులో లెవల్-2 ADAS సూట్, న్యూ 2-స్పోక్ స్టీరింగ్ వీల్, 8-స్పీకర్ హర్మాన్ కార్డాన్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో EPB, యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ కెమెరా, కియా కనెక్ట్ వంటి ఫీచర్లతో పాటు వెంటిలేషన్, రిక్లైన్ ఫంక్షన్ వైర్‌లెస్ ఛార్జర్‌తో వెనక సీట్లు ఉన్నాయి.
Kia Syros Interior (Photo Credit- Kia India) వీటితో పాటు ఈ కారు.. ఆటో-డిమ్మింగ్ IRVM, ఫోర్-వే పవర్డ్ డ్రైవర్ సీట్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డ్రైవ్ అండ్ ట్రాక్షన్ మోడ్స్, డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్, టచ్-బేస్డ్ AC కంట్రోల్స్, OTA అప్‌డేట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, డ్యూయల్ కెమెరాలతో డాష్ క్యామ్, ప్యాడిల్ షిఫ్టర్స్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో వస్తుంది.
Kia Syros Safety Features (Photo Credit- Kia India) ఇంజిన్ ఆప్షన్స్:ఈ కొత్త కియా సైరాస్లో రెండు ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొదటిది 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. ఇది 118bhp పవర్, 172Nm టార్క్ అందిస్తుంది. ఇక రెండోది 114bhp పవర్, 250Nm టార్క్ అందించే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది. అయితే 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ DCT యూనిట్ ఆప్షన్లుగా అందుబాటులో ఉంటాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొంటున్నారా? అయితే ఆగండి.. త్వరలో 4 కొత్త మోడల్స్!
'స్కోడా కైలాక్' క్రేజ్ చూశారా?- 10రోజులకే 10వేల బుకింగ్స్.. ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోందిగా..!
బైక్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్- ఆ మోడల్స్ ఇక మార్కెట్లో ఉండవుగా!