తెలంగాణ

telangana

ETV Bharat / business

కియా కార్ లీజింగ్​ షురూ - హైదరాబాద్ సహా 6 నగరాల్లో సర్వీస్​! - Kia Leasing Program - KIA LEASING PROGRAM

KIA Car Leasing : రోజుకో కొత్త కారులో తిరగాలని ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్​. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కియా భారత్​లో కార్​ లీజింగ్ సర్వీస్​ను ప్రారంభించింది. హైదరాబాద్​ సహా మొత్తం 6 నగరాల్లో ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాలు మీ కోసం.

Kia Leasing Program
Kia India (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 10:59 AM IST

KIA Car Leasing : మీరు కార్ లవర్సా? కానీ కారు కొనేంత డబ్బులు మీ దగ్గర లేవా? డోంట్​ వర్రీ. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కియా, భారత్​లో కార్ లీజింగ్ సర్వీస్​ను ప్రారంభించింది. అందువల్ల మీరు అతి తక్కువ అద్దె చెల్లించి నచ్చిన కియా కారును లీజ్​కు తీసుకోవచ్చు.

భారతదేశంలో కొత్త కారు కొంటే దానికి కచ్చితంగా ఇన్సూరెన్స్ చేయాల్సి ఉంటుంది. పైగా నిర్వహణ ఖర్చులు కూడా భరించాల్సి ఉండాలి. ఒక వేళ మీ దగ్గర పాత కారు ఉంటే, దానిని విక్రయించేటప్పుడు చాలా తక్కువ మొత్తమే వెనక్కు వస్తుంది. అందువల్ల కొత్త మోడళ్లకు అప్​గ్రేడ్ కావడం కష్టమవుతుంది. ఇలాంటి సమస్యలేవీ లేకుండా, ఇప్పుడు కారును లీజ్​కు తీసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

6 నగరాల్లో
కియా కంపెనీ, ఓరిక్స్ ఆటో ఇన్​ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్​తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కనుక ఈ రెండూ కలిసి కియా లీజ్​ సేవలను హైదరాబాద్​, చెన్నై, బెంగళూరు, ముంబయి, పుణె, దిల్లీల్లో ప్రారంభించాయి. ఈ విషయాన్ని కియా ఇండియా చీఫ్​ సేల్స్ ఆఫీసర్​ మ్యుంగ్​-సిక్ సోన్ తెలిపారు.

ఈ వాహనాలు మాత్రమే!
కియా కార్లను 24-60 నెలల వ్యవధి వరకు లీజుకు తీసుకోవచ్చు. హైలెట్​ ఏమిటంటే, ఎలాంటి ఎడ్వాన్స్ పేమెంట్ కూడా చేయనక్కర్లేదు. కియా సోనెట్‌ కారుకు నెలకు రూ.21,900; సెల్టోస్‌కు రూ.28,900, కారెన్స్‌కు రూ.28,800 వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

How To Get Car Subscription : మనలో చాలా మందికి కార్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ కారు కొనేంత స్తోమత వారికి ఉండదు. ఇలాంటి వారి కోసమే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సబ్​స్క్రిప్షన్ ప్లాన్​లను అందిస్తున్నాయి. వీటి ద్వారా మీకు నచ్చిన కారును నిర్దిష్ట కాలం పాటు వాడుకోవచ్చు. దీని కోసం మీరు ప్రతినెలా నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. ఇది ఏదో చాలా బాగుంది కదూ. మీరు కనుక కార్​ లవర్​ అయితే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, నెలకో కొత్త కారులో హాయిగా తిరగవచ్చు. వాస్తవానికి విదేశాల్లో ఈ కార్ సబ్​స్క్రిప్షన్​ చాలా పాపులర్.

డిపాజిట్ ఎంత చేయాలి?
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ కార్​ సబ్​స్క్రిప్షన్ ప్లాన్​లను అందిస్తున్నాయి. మీరు ఎంచుకునే మోడల్​ ఆధారంగా ఈ డిపాజిట్ మొత్తం మారుతుంది. అయితే కార్​ సబ్​స్క్రైబ్​ చేసుకోవడానికి ముందుగా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేదా డౌన్ పేమెంట్ చెల్లించాల్సి వస్తుంది. తరువాత మీరు కోరుకున్నంత కాలానికి నెలనెలా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతే సింపుల్​.

కార్ సబ్​స్క్రిప్షన్ బెనిఫిట్స్​!
మీకు నచ్చిన కారును సబ్​స్క్రైబ్ చేసుకోవచ్చు. దీనిని మీకు నచ్చినప్పుడు వదులుకోవచ్చు కూడా. కార్​ సబ్​స్క్రైబ్ చేసుకున్న తరువాత మీకు రోడ్​ సైడ్ అసిస్టెన్స్ లభిస్తుంది. మీరు ప్రస్తుతం వాడుతున్న మోడల్​ను వదులుకొని, కొత్త మోడల్​కు అప్​గ్రేడ్ చేసుకోవడానికి వీలవుతుంది.

కారు మెయింటెనెన్స్​, ఇన్సూరెన్స్​, ట్యాక్స్​లు అన్నీ మీరు చెల్లించే నెలవారీ సభ్యత్వ రుసుములోనే కవర్ అయిపోతాయి. కనుక ఎక్స్​ట్రా ఫీజు కట్టాల్సిన పని ఉండదు. యూఎస్​, యూరోప్​ల్లో ఇది బాగా పాపులర్ అయ్యింది. ఇండియాలో కూడా ఈ కార్​ సబ్​స్క్రిప్షన్ ప్లాన్ క్రమంగా ప్రాచుర్యం పొందుతోంది.

మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Popular Bikes In India

గతుకుల రోడ్లపైనా ప్రయాణం సాఫీగా జరగాలా? ఈ టాప్​-10 సస్పెన్షన్​ కార్లపై ఓ లుక్కేయండి! - Best Suspension Cars

ABOUT THE AUTHOR

...view details