Jio Vs Airtel Vs Vi Plans :ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా (VI) ఇటీవలే మొబైల్ ప్లాన్స్ ధరలను సవరించాయి. వీఐ 4జీ డేటా ప్లాన్‌ను, జియో, ఎయిర్‌టెల్‌లు కొత్తగా 5జీ డేటా బూస్టర్ ప్లాన్లను తీసుకొచ్చాయి. ఈ కొత్త ప్లాన్స్ రాక ముందు 5జీ నెట్వర్క్ పరిధిలో ఉన్న 5జీ మొబైల్ యూజర్లందరికీ అన్ని ప్లాన్లపై అపరిమిత 5జీ డేటాను అందించాయి జియో, ఎయిర్‌టెల్‌లు. కానీ ఇప్పుడు 5జీ డేటాపై పరిమితులు విధించాయి. ఈ నేపథ్యంలోనే అపరమిత 5జీ డేటాను పొందేందుకు జియో, ఎయిర్‌టెల్ 28 రోజులు, 365 రోజుల ప్లాన్లను తీసుకొచ్చాయి. మరోవైపు వీఐ కూడా మొబైల్ టారిఫ్ ధరలను పెంచింది.
జియో 5జీ ప్లాన్స్
జియో రూ.349 ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే 28రోజుల పాటు అపరిమిత కాల్స్, 2జీబీ డేటా లభిస్తుంది. అదే 365 రోజల కోసం అయితే రూ.3,599లతో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ తీసుకుంటే, అపరిమిత కాల్స్‌తో పాటు, రోజుకు 2.5జీబీ డేటా చొప్పున పొందవచ్చు. ఈ రెండు ప్లాన్స్ అపరమిత 5జీ డేటాను అందిస్తాయి.
ప్లాన్ వ్యాలిడిటీ | 28 రోజులు | 365 రోజులు |
---|---|---|
ధర | రూ.349 | రూ.3599 |
డేటా | 2జీబీ/రోజు (మొత్తం 56 జీబీ డేటా) | 2.5జీబీ/రోజు (మొత్తం 912.5 జీబీ) |
వాయిస్ కాల్స్ | అపరిమిత కాల్స్ | అపరిమిత కాల్స్ |
ఎస్ఎమ్ఎస్ | 100 ఎస్ఎమ్ఎస్/రోజు | 100 ఎస్ఎమ్ఎస్/రోజు |
ఇతర ప్రయోజనాలు | జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ | జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ |
ఎయిర్‌టెల్ 5జీ ప్లాన్స్
ఎయిర్‌టెల్ అపరమిత 5జీ డేటాను పొందేందుకు రూ.409లతో రీఛార్జ్ చేస్తే 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. అదే రూ.3,599లతో రీఛార్జ్ చేస్తే రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున సంవత్సరం పాటు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది.
ప్లాన్ వ్యాలిడిటీ | 28 రోజులు | 365 రోజులు |
---|---|---|
ధర | రూ.409 | రూ.3,599 |
డేటా | 2 జీబీ/రోజు | 2.5 జీబీ/రోజు |
వాయిస్ కాల్స్ | అపరిమిత కాల్స్ | అపరిమిత కాల్స్ |
ఎస్ఎమ్ఎస్ | 100ఎస్ఎమ్ఎస్/రోజు | 100ఎస్ఎమ్ఎస్/రోజు |
ఇతర ప్రయోజనాలు | ఎయిర్‌టెల్ స్ట్రీమ్ ప్లై(ఫ్రీ 20+ ఓటీటీలు), 1 ఫ్రీ హలోట్యూన్, వింక్ మ్యూజిక్ | అపోలో 24/7 సర్కిల్, 1 ఫ్రీ హలోట్యూన్, వింక్ మ్యూజిక్ |