తెలంగాణ

telangana

ETV Bharat / business

జియో బంపర్​ ఆఫర్​ - ఈ పాపులర్​ ప్లాన్​పై 78GB ఎక్స్​ట్రా డేటా! - JIO OFFERING 78GB EXTRA DATA - JIO OFFERING 78GB EXTRA DATA

Jio Offering 20GB Extra Data : జియో యూజర్లకు గుడ్ న్యూస్​. రిలయన్స్ జియో కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్లపై పూర్తి ఉచితంగా అదనపు డేటా అందిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Jio plans 20GB Extra Data
Jio Offering 20GB Extra Data

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 4:59 PM IST

Jio Offering 20GB Extra Data : రిలయన్స్ జియో తమ యూజర్లకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కొన్ని పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్స్​పై 6జీబీ, 18జీబీ, 20జీబీ, 78జీబీ వరకు అదనపు డేటాను పూర్తి ఉచితంగా అందిస్తోంది. పైగా వీటన్నింటిలోనూ అపరిమిత 5జీ డేటాను ఫ్రీగా ఇస్తోంది. సూపర్ కదా! మరెందుకు ఆలస్యం ఆ ప్లాన్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

Rs.398 Plan : ఈ ప్లాన్​ వ్యాలిడిటీ 28 రోజులు. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 SMSలు, 2జీబీ డేటా లభిస్తాయి. పైగా ఈ ప్లాన్‌తో 6 జీబీ డేటా అదనంగా వస్తుంది. ఈ ప్లాన్​ తీసుకున్న యూజర్లకు ఉచితంగా జియో టీవీ, జియోక్లౌడ్‌ యాప్‌లతో పాటు సోనీలివ్‌, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్‌గేట్‌ ప్లే, డిస్కవరీ+, సన్‌నెక్ట్స్‌, చౌపల్‌, డాక్యుబే, ఎపిక్‌ ఆన్‌ లాంటి ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

Rs.749 Plan : ఈ ప్లాన్​ వ్యాలిడిటీ 90 రోజులు. ఈ ప్లాన్ తీసుకున్న యూజర్లకు 20 జీబీ అదనపు డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌; రోజుకు 100 SMSలు, 2జీబీ డేటా దొరుకుతుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌లు ఫ్రీగా యాక్సెస్‌ చేయవచ్చు.

Rs.1198 Plan :ఈ ప్లాన్​ వ్యాలిడిటీ 84 రోజులు. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 SMSలు, 2జీబీ డేటా లభిస్తాయి. ఈ ప్లాన్ తీసుకున్న యూజర్లకు 18 జీబీ అదనపు డేటా లభిస్తుంది. జియో టీవీ, జియో క్లౌడ్‌ యాప్‌లతో పాటు ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్​, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీ లివ్‌, జీ5, జియో సినిమా ప్రీమియం, డిస్కవరీ+ సహా మొత్తం 14 ఓటీటీల సబ్​స్క్రిప్షన్ పూర్తి ఉచితంగా అందిస్తారు.

Rs.4498 Plan :ఇది ఒక వార్షిక ప్లాన్​ (వ్యాలిడిటీ 365 రోజులు). అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 SMSలు, 2జీబీ డేటా వస్తాయి. ఈ ప్లాన్‌ తీసుకున్న యూజర్లకు 78 జీబీ అదనపు డేటా లభిస్తుంది. అలాగే జియో టీవీ, జియో క్లౌడ్‌ యాప్‌లతో పాటు ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్​, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీ లివ్‌, జీ5, జియో సినిమా ప్రీమియం, డిస్కవరీ+ సహా మొత్తం 14 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీగా లభిస్తుంది.

సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారా? సింపుల్​గా రికవరీ చేసుకోండిలా! - Recovering Money From Cyber Scams

రూ.6 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? టాప్​-5 మోడల్స్ ఇవే! - Best Cars Under 6 Lakh

ABOUT THE AUTHOR

...view details