Jio New Unlimited OTT Plan :జియో ఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ కస్టమర్ల కోసం జియో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.888తో 'అల్టిమేట్ స్ట్రీమింగ్ ప్లాన్'ను లాంఛ్ చేసింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్ టీవీ ప్రసారాలు, ఓటీటీ ప్రయోజనాలతో ఈ ప్లాన్‌ను తీసుకువచ్చింది. కొత్త వినియోగదారులతో పాటు, ఇప్పటికే ఉన్న జియో ఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ వినియోగదారులు కూడా ఈ ప్లాన్‌కు మారవచ్చని జియో వెల్లడించింది.
ఫ్రీ ఫ్రీ ఫ్రీ
జియో తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్‌తో 30 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం, డిస్నీ+హాట్ స్టార్, సోనీ లివ్, ఈటీలీ విన్ వంటి 15 ఓటీటీ యాప్స్ లభిస్తాయి. ప్రస్తుత ఐపీఎల్ ధన్ ధనా ధన్ ఆఫర్ కూడా ఈ ప్లాన్‌కు వర్తిస్తుంది. దీని కింద అర్హత కలిగిన జియో ఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ కస్టమర్లు 50 రోజుల డిస్కౌంట్ క్రెడిట్ వోచర్‌ను పొందవచ్చు.
రూ.29కే జియో సినిమా ప్రీమియం
వీడియో స్ట్రీమింగ్ రంగంపై పట్టు సాధించేందుకు జియో సినిమా సిద్ధమైంది. ఇటీవలే రూ.29, రూ.89లకు రెండు కొత్త ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. నెలకు రూ.29 చెల్లిస్తే ఒక డివైజ్‌లో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా 4కే వీడియో క్వాలిటీతో కంటెంట్‌ను వీక్షించొచ్చు. పైగా డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లోనూ కంటెంట్‌ను చూడొచ్చు. సినిమాలు, హాలీవుడ్ బ్లాక్బస్టర్లు, పిల్లల షోలు, టీవీ ఎంటర్‌టైన్ మెంట్‌ను స్మార్ట్ టీవీ సహా ఏ డివైజ్‌లోనైనా వీక్షించే అవకాశం ఉంటుంది. లైవ్ టెలికాస్ట్‌లు, స్పోర్ట్స్ మాత్రం యాడ్స్‌తో వస్తాయి.
BSNL Prepaid Plans :
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తమ వినియోగదారుల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ఒకటి డేటా వోచర్ కాగా, మరొకటి వ్యాలిడిటీ పొడిగింపు ప్లాన్. వీటి ధరలు వరుసగా రూ.58, రూ.59. ఈ ప్లాన్ల పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.