తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒకే ఏడాదిలో ఉద్యోగాలు మారారా? ITR ఫైలింగ్​లో ఫారం-16 ఎలా పొందాలంటే? - ITR Form 16 - ITR FORM 16

ITR Form 16 : మీరు ఉద్యోగులా? ఒకే ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు మారారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఐటీఆర్ దాఖలు చేసినప్పుడు మారిన కంపెనీల నుంచి ఫారం-16 పొందడం ఎలా? అన్ని సంస్థల నుంచి ఫారం-16ను తీసుకోవాలా? ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో దాని ప్రాముఖ్యం ఏమిటి? మొదలైన విషయాలు తెలుసుకుందాం.

ITR Form 16
ITR Form 16 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 1:41 PM IST

ITR Form 16 :ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు సమయం దగ్గరపడుతోంది. వచ్చే కొన్ని రోజుల పాటు ఉద్యోగులంతా ఐటీఆర్ దాఖలుపైనే దృష్టి సారిస్తారు. యాజమాన్యాలు జారీ చేసే ఫారం- 16 కోసం వేచి చూస్తుంటారు. ఉద్యోగులకు కంపెనీ అందించే ఫారం-16లో వేతన ఆదాయం, పన్ను కోతలు, టీడీఎస్ వంటి సమగ్ర సమాచారం ఉంటుంది. ఫారం- 16ను రిఫరెన్స్గా తీసుకోవడం వల్ల పన్ను రిటర్న్ కచ్చితత్వం మెరుగుపడుతుంది. ఇది మీ యజమాని ద్వారా ప్రభుత్వానికి నివేదించిన ఆదాయంతో సరిపోలుతుంది.

అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐటీఆర్‌ దాఖలు చేయడానికి ఫారం-16 చాలా అవసరం. అయితే ఒకే ఏడాదికి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తే ఒక ఫారం-16 ఫారం లభిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో ఉద్యోగం చేస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఉద్యోగం మారితే ఫారం- 16 ఎలా?
ఫారం-16 కోసం ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 203 చట్టబద్ధమైన ఫ్రేమ్​వర్క్​ను ఏర్పాటు చేస్తుంది. దీనిని యజమానులు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ ప్రత్యేకంగా వేతనం ద్వారా పొందిన ఆదాయాన్ని తెలియజేస్తుంది. అయితే, ఆర్థిక సంవత్సరం మొత్తం ఒకే సంస్థలో ఉద్యోగం చేస్తే ఫారం-16 విషయంలో ఏ సమస్య ఉండదు. కానీ, ఒక వ్యక్తి ఒక ఏడాదిలో ఒకటి కన్నా ఎక్కువ సంస్థల్లో ఉద్యోగం చేస్తే ఎలా? అప్పుడు ఉద్యోగి ఫారం- 16ను ఏ యజమాని నుంచి పొందాలి? అన్న సందేహాలు వస్తుంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి కన్నా ఎక్కువ కంపెనీల్లో ఉద్యోగాలు చేసినట్లయితే, ఆ ఆర్థిక సంవత్సరంలో మీరు ఉద్యోగం చేసిన కాలానికి సంబంధించిన ఫారం-16ను ఆయా యాజమాన్యాలు మీకు అందిస్తాయి. అవి ఆటోమేటిక్​గా మీ ఐటీఆర్లో ప్రీ ఫీల్డ్​గా కనిపిస్తాయి. అలా లేని పక్షంలో, మాన్యువల్ గా ఆ వివరాలను ఐటీఆర్​ ఫామ్​లో నింపాల్సి ఉంటుంది.

ఫారం- 16లోని 'పార్ట్- ఏలో ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగి టీడీఎస్ సమాచారం ఉంటుంది. పార్ట్- బీలో ఉద్యోగి వేతన ఆదాయం, పన్ను మినహాయింపుల సమాచారం ఉంటుంది. పార్ట్ ఏ లో పేర్కొన్న సమాచారాన్ని పార్ట్- బీ విశదీకరిస్తుంది. అదనంగా, పార్ట్-బీలో ఆ ఏడాదిలో ఉద్యోగి చేసిన ఏదైనా ముందస్తు పన్ను చెల్లింపుల సమాచారం కూడా ఉంటుంది. మీరు ఆర్థిక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసినట్లయితే, పార్ట్- బీలో వివిధ యజమానుల నుంచి పొందిన ఆదాయ వివరాలను కూడా ప్రత్యేక విభాగాలుగా విభజించవచ్చు. ఐటీఆర్ దాఖలుకు ఫారం- 16లోని పార్ట్- ఏ చాలా కీలకం. అలాగే ఐటీఆర్ కచ్చితత్వాన్ని ధ్రువీకరించడానికి ఫారం- 16లోని పార్ట్ బీ అవసరం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details