How Does The Income Tax Department Track Our Income Streams :ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు గడువు దగ్గరపడుతోంది. చాలా మంది తమ ఆదాయాన్ని తక్కువగా చూపి పన్ను ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. మరికొందరు తక్కువ ఆదాయాన్ని చూపి, తక్కువ పన్ను చెల్లిస్తుంటారు. ఇలా చేస్తే ఆదాయపు పన్ను శాఖ ఇట్టే పసిగట్టేస్తుంది. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.
ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే!
ఉద్యోగులు, వ్యాపారులు సహా అధిక ఆదాయం సంపాదించే ప్రతి ఒక్కరూ ఐటీఆర్ ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే కొంత మంది తమ ఆదాయాన్ని తక్కువగా చూపించి, పన్ను ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి ఆదాయ వివరాలను తెలుసుకోవటానికి ఐటీ శాఖకు 57 రకాల సోర్సెస్ ఉన్నాయి. వీటన్నింటినీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) 'వార్షిక సమాచార నివేదిక' (AIS)లో పొందుపరుస్తుంది. పన్ను చెల్లింపుదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన ఆర్థిక లావాదేవీల వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి. ఐటీఆర్ దాఖలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాలనే లక్ష్యంతోనే ఆదాయ పన్ను శాఖ ఈ ఏఐఎస్‌ను తీసుకువచ్చింది. ట్యాక్స్ పేయర్స్ ఈ-ఫైలింగ్ వెబ్సైట్ www.incometax.gov.in ద్వారా ఏఐఎస్‌ను చాలా సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
IT Dept Can Track Your Earnings From THSE 57 Sources :
- జీతం
- అద్దె ద్వారా వచ్చిన ఆదాయం
- డివిడెండ్లు
- సేవింగ్స్ అకౌంట్లపై వచ్చిన వడ్డీ ఆదాయం
- డిపాజిట్లపై వచ్చిన వడ్డీ ఆదాయం
- ఇతర పథకాలపై వచ్చిన వడ్డీ ఆదాయం
- ఆదాయ పన్ను రిఫండ్ పొందినప్పుడు, దానిపై అందిన వడ్డీ ఆదాయం
- ప్లాంట్, యంత్రాలపై వచ్చే అద్దె ఆదాయం
- లాటరీ/ క్రాస్‌వర్డ్ పజిల్‌ల ద్వారా గెలుచుకున్న డబ్బు వివరాలు
- గుర్రపు పందెంలో గెలుచుకున్న డబ్బు వివరాలు
- పీఎఫ్ రాబడి
- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ నుంచి వచ్చే వడ్డీ ఆదాయం
- విదేశీ కంపెనీల నుంచి వచ్చే వడ్డీ ఆదాయం
- గవర్నమెంట్ సెక్యూరిటీలు, బాండ్లపై వచ్చిన వడ్డీ
- విదేశీ కంపెనీల నుంచి వచ్చే ఆదాయం
- ఆఫ్‌షోర్ ఫండ్స్‌పై వచ్చిన ఆదాయం, దీర్ఘకాలిక మూలధన లాభాలు
- విదేశీ కరెన్సీ బాండ్లు, భారతీయ కంపెనీల షేర్లు ద్వారా వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలు
- విదేశీ సంస్థాగత పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం
- సెక్యూరిటీల నుంచి వచ్చిన నిర్దిష్ట ఫండ్ ఆదాయం
- బీమా కమిషన్
- బీమా పాలసీలపై వచ్చే ఆదాయం
- జాతీయ పొదుపు పథకాల్లో జమ చేసిన మొత్తాన్ని వెనక్కు తీసుకున్నప్పుడు వచ్చిన రాబడి
- లాటరీ టిక్కెట్ల అమ్మకంపై వచ్చిన కమీషన్
- సెక్యూరిటైజేషన్ ట్రస్ట్‌లో పెట్టుబడి ద్వారా వచ్చే ఆదాయం
- మ్యూచువల్ ఫండ్, యూటీఐ యూనిట్లను తిరిగి కొనుగోలు చేసినప్పుడు వచ్చిన రాబడి
- ప్రభుత్వానికి చెల్లించాల్సిన వడ్డీ/ డివిడెండ్/ ఇతర మొత్తాలు
- సీనియర్ సిటిజన్ ఆదాయం
- భూమి లేదా భవనం అమ్మకం
- స్థిరాస్తి బదిలీ కోసం రసీదులు
- వాహనాల అమ్మకం
- షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించిన వివరాలు
- ఆఫ్ మార్కెట్ డెబిట్ లావాదేవీలు
- ఆఫ్ మార్కెట్ క్రెడిట్ లావాదేవీలు
- వ్యాపార రసీదులు
- జీఎస్టీ టర్నోవర్
- జీఎస్టీ కొనుగోళ్లు
- వ్యాపార ఖర్చులు
- అద్దె చెల్లింపు
- ఇతర చెల్లింపులు (Miscellaneous payments)
- నగదు డిపాజిట్లు
- నగదు ఉపసంహరణలు
- నగదు చెల్లింపులు
- విదేశీ కరెన్సీ కొనుగోళ్లు/ అవుట్వార్డ్ ఫారిన్ రిమిటెన్స్
- విదేశీ చెల్లింపుల రసీదులు
- నాన్- రెసిడెంట్ స్పోర్ట్స్‌మెన్ లేదా స్పోర్ట్స్ అసోసియేషన్స్‌కు చెల్లింపులు
- విదేశీ ప్రయాణాలు
- స్థిరాస్తి కొనుగోళ్లు
- వాహనం కొనుగోళ్లు
- టైమ్ డిపాజిట్ల కొనుగోళ్లు
- షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్ల కొనుగోళ్లు
- క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు
- బ్యాంకు ఖాతాలోని నగదు
- వ్యాపార ట్రస్ట్ ద్వారా పంపిణీ చేసిన ఆదాయం
- పెట్టుబడి నిధి ద్వారా పంపిణీ చేసిన ఆదాయం
- విరాళాల ద్వారా వచ్చిన ఆదాయం
- వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీలపై ఇచ్చిన రసీదు
- ఆన్లైన్ గేమ్స్ ద్వారా గెలుచుకున్న ఆదాయం