ABS టూ TCS- కారులో మస్ట్‌గా ఉండాల్సిన టాప్ 10 సేఫ్టీ ఫీచర్స్ ఇవే! - IMPORTANT CAR SAFETY FEATURES
కారులో ఉండాల్సిన టాప్-10 సేఫ్టీ ఫీచర్లు ఇవే!
Important Car Safety Features (Getty Images)
Published : Dec 13, 2024, 7:36 PM IST
Important Car Safety Features :కారులో కొన్ని సేఫ్టీ ఫీచర్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అంతా సురక్షితంగా ప్రయాణించగలరనేది నిజం. ఈ నేపథ్యంలో కారులో ఉండాల్సిన టాప్ 10 సేఫ్టీ ఫీచర్లు గురించి తెలుసుకుందాం.
- యాంటీ- లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) :
సడెన్‌గా బ్రేక్స్ వేసినప్పుడు చక్రాలు లాక్ అవ్వకుండా 'యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్' (ఏబీఎస్) అడ్డుపడుతుంది. దీని వల్ల డ్రైవర్ స్టీరింగ్‌ను ఈజీగా కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. వెహికల్ స్కిడ్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది. - ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) :
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ) అనేది వాహనం స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది. మలుపులు తిరిగేటప్పుడు, జారుడుగా ఉన్న రోడ్లపై వెళ్లేటప్పుడు ఈఎస్సీ కారుకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడుతుంది. - ఎయిర్ బ్యాగ్స్ :
కారుకు అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ డ్రైవర్‌కు గాయాలు కాకుండా కాపాడతాయి. ఇప్పుడు దాదాపు అన్ని మోడల్ కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇవి కారు లోపల ఉన్న ప్రయాణికులకు రక్షణనిస్తాయి. - సీట్ బెల్ట్ :
మీరు కొనే కారులో కచ్చితంగా ప్రీటెన్షనర్స్తో ఉన్న సీట్ బెల్ట్స్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కారు ప్రమాదానికి గురైనప్పుడు ప్రీటెన్షనర్స్ ఉన్న సీట్ బెల్ట్‌లు ఆటోమెటిక్‌గా బిగుతుగా మారతాయి. ప్రయాణికులు కారు ముందు భాగాన్ని ఢీకొనే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. - ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) :
వీల్ స్పిన్ కాకుండా 'ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్' (టీసీఎస్) కాపాడుతుంది. - ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) :
ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ) అనేది చక్రాల మధ్య బ్రేకింగ్ ఫోర్స్‌ను పంపిణీ చేస్తుంది. దీని వల్ల కారు బ్రేకింగ్ సిస్టమ్ అద్భుతంగా పనిచేసి, బండి స్థిరంగా ఉండేలా చేస్తుంది. - టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) :
కారు టైర్లలో సరిపోయినంత ప్రెషర్ లేనప్పుడు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) వెంటనే డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. దీని వల్ల టైర్లు పేలిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. వాహనం కూడా భద్రంగా ఉంటుంది. - రివర్స్ పార్కింగ్ సెన్సార్స్/ కెమెరా :
కాస్త ఇరుకైన ప్రదేశాల్లో కారు పార్కింగ్ చేసేటప్పుడు రివర్స్ పార్కింగ్ కెమెరాలు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పాదచారులను లేదా అడ్డంకులను కారు ఢీకొనే ప్రమాదం తగ్గుతుంది. - ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ (AEB) :
ఆటోమెటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ముందుగానే వాహనం ఢీకొనే ప్రమాదాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేస్తుంది. దీంతో భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. - లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్ (LDW) :
మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనుకోకుండా లేన్ నుంచి బయటకు వెళ్తే లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్ (ఎల్డీడబ్ల్యూ) డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది. వాహన ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి.