Cardless Cash Withdrawal From ATM : బ్యాంకింగ్ టెక్నాలజీ విప్లవాత్మకంగా మారిపోతోంది. ఇంతకు ముందు ఏటీఎంనుంచి డబ్బులు విత్‌డ్రా చేసేందుకు డెబిట్ కార్డు తప్పనిసరిగా అవసరమయ్యేది. అయితే గత కొన్నేళ్లుగా డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసే ఫీచర్స్‌ను వినియోగిస్తూ ప్రజలు ఎంతో కంఫర్ట్‌గా ఫీలవుతున్నారు. ఒకవేళ జేబులో డెబిట్ కార్డు లేకపోయినా, చేతిలో ఉన్న ఫోన్‌లోని ఫీచర్స్‌ను వాడుకొని ఏటీఎం నుంచి క్యాష్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన టిప్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.
కోడ్‌ను స్కాన్ చేసి
డెబిట్ కార్డులు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులను విత్‌డ్రా చేయాలంటే ఆ బ్యాంకుకు సంబంధించిన మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను మనం యాక్సెస్ చేయాలి. దీనిలోని ప్రాసెస్‌ను ఫాలో అయితే, మన కోసం బ్యాంకు ప్రత్యేక కోడ్‌ను జనరేట్ చేస్తుంది. అదనంగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కూడా క్యాష్‌ను విత్‌డ్రా చేయొచ్చు. ఈ క్రమంలో ఫోన్‌లోని పిన్ లేదా బయోమెట్రిక్ ద్వారా బ్యాంకు అకౌంట్ యూజర్ ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది.
యూపీఐతో
ఏటీఎం నుంచి క్యాష్‌ను విత్‌డ్రా చేసేందుకు యూపీఐ ఫీచర్‌ను కూడా మనం వాడుకోవచ్చు. ఇందుకోసం మన స్మార్ట్‌ఫోన్‌లోని యూపీఐ యాప్‌ను వాడాలి. కార్డ్‌లెస్‌గా నగదును విత్‌డ్రా చేయడానికి అనుసరించే స్టెప్స్‌నే ఇక్కడ కూడా ఫాలో కావాలి. అయితే ఈ పద్ధతిలో విత్‌డ్రా చేసేటప్పుడు మన యూపీఐ పిన్‌ను తప్పకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి.