Best Ways to Make Your Car Less Polluting :కారు మెయింటెనెన్స్ విషయంలో చాలా మంది అశ్రద్ధగా ఉంటుంటారు. టైమ్ టూ టైమ్ సర్వీసింగ్ కూడా చేయించరు. దీనివల్ల వెహికల్ నుంచి ఎక్కువ పొగ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో సర్వీసింగ్ చేయించకపోవడం వల్ల ఎయిర్, ఫ్యూయల్ ఫిల్టర్ల లోపల డస్ట్ పేరుకుపోయే ఛాన్స్ ఉంటుంది. దాంతో అధిక పొగ రావొచ్చు. అలాగే ఇంజిన్ ఆయిల్ ఎప్పటికప్పుడూ చెక్ చేసి మార్చుతుండాలి. ఇలా సరైన టైమ్‌లో కారును సర్వీసింగ్ చేయించడం వల్ల వెహికల్ నుంచి వచ్చే పొగ చాలా వరకు తగ్గుతుందంటున్నారు నిపుణులు.
ఇంజన్ ఆపండి : ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటంటే ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎక్కువసేపు కారు నిలపాల్సి వచ్చినప్పుడు వెహికల్ ఇంజిన్ ఆఫ్ చేయరు. కానీ.. నిమిషం కన్నా ఎక్కువ సమయం ఆపాల్సి వస్తే ఇంజిన్‌ను ఆఫ్ చేయడం మంచిది. ఈ ట్రిక్ కారు నుంచి వచ్చే పొగను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది.
సరిగ్గా నడపడం : కారు నుంచి వెలువడే పొగను తగ్గించుకోవాలంటే మీరు చేయాల్సిన మరో పని.. వాహనాన్ని సరిగా నడపాలి. అలాకాకుండా ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ వెహికల్‌ను అటూఇటూ తిప్పడం, సడన్‌గా బ్రేకులు వేసి ఆ వెంటనే ఎక్సలేటర్ ప్రెస్ చేయడం వంటి పనులు చేయడం వల్ల ఇంజిన్ అధిక ఒత్తిడికి లోనవుతుంది. దాంతో అధిక పొగ వస్తుంది. కాబట్టి.. కారును సరిగ్గా నడపాలి. దీనివల్ల కేవలం ఇంజిన్‌ను కాపాడుకోవడమే కాదు.. రోడ్డు ప్రమాదాలు జరగకుండా నిరోధించొచ్చు. తద్వారా ప్రాణాలను కూడా రక్షించుకోవచ్చు.