ETV Bharat / business

క్రెడిట్​ కార్డుపై ఫ్రీగా 8 రకాల ఇన్సూరెన్స్​లు - అవేంటో తెలుసా? - CREDIT CARD INSURANCE

క్రెడిట్​ కార్డ్​ యూజర్ల కోసం అదనపు ఛార్జీలు లేకుండానే బీమా సౌకర్యం - పూర్తి వివరాలు మీ కోసం!

Credit Card Insurance Types
Credit Card Insurance Types (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2024, 7:36 PM IST

Credit Card Insurance Types : ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. డబ్బులు లేకపోయినా కొనుగోళ్ల కోసం ఎక్కువగా ఈ కార్డులు వాడుతున్నారు. ఆర్థిక అవసరాలకే కాకుండా క్రెడిట్​ కార్డులు పలు రకాల ఇన్సూరెన్స్​లను కూడా అందిస్తున్నాయి. వాటి కోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డు హోల్డర్​ కావడం వల్ల ఆటోమేటిట్​గా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇంతకీ క్రెడిట్​ కార్డులు అందిస్తున్న వివిధ రకాల ఇన్సూరెన్స్​లు ఏమిటో ఈ స్టోరీలో చూద్దామా?

1.ట్రావెల్ ఇన్సూరెన్స్ :

  • ట్రిప్ రద్దు : అనారోగ్యానికి గురైనప్పుడు లేదా వాతావరణం బాగాలేనప్పుడు ప్రయాణం రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈ ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది.
  • ప్రయాణ ఆలస్యం : ప్రయాణం ఆలస్యమైతే వసతి, భోజనం, రవాణా వంటి ఖర్చులను కవర్ చేస్తుంది.
  • లగేజీ డ్యామేజ్​ : ప్రయాణ సమయంలో వస్తువులను ఎవరైనా దొంగిలించినా లేదా డ్యామేజీ అయినా బీమా కవరేజీ ఉంటుంది.
  • ఎమర్జెన్సీ కవర్: క్రెడిట్ కార్డు హోల్డర్స్ విదేశాల్లో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురైతే వైద్య ఖర్చులను ఈ బీమా కవర్ చేస్తుంది. అంతే కాకుండా ప్రమాదవశాత్తు గాయపడినా కూడా కవర్ చేస్తుంది.

2. పర్ఛేజ్ ప్రొటెక్షన్ : క్రెడిట్​ కార్డు ద్వారా ఏదైనా వస్తువు కొన్నప్పుడు అది నిర్దిష్ట వ్యవధిలోపు (అనగా 90 నుంచి 120 రోజులు) దొంగతనానికి గురైనా లేదా ప్రమాదవశాత్తు డ్యామేజ్​ అయినా ఆ ఖర్చులను ఈ బీమా కవర్ చేస్తుంది.

3.ఎక్స్​టెండెడ్​ వారంటీ : క్రెడిట్​ కార్డు ద్వారా కొన్న వస్తువులపై ఉన్న వారంటీని ఒకటి లేదా రెండు సంవత్సరాలకు పొడిగిస్తుంది. కానీ, కొన్ని నిర్దిష్ట వస్తువులపై మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది.

4. రిటర్న్ ప్రొటెక్షన్ : అమ్మకపుదారుడు అంగీకరించకపోయినా క్రెడిట్​ కార్డు ద్వారా కొనుగోలు చేసిన కొన్ని వస్తువులను నిర్దిష్ట వ్యవధిలో తిరిగి ఇవ్వడానికి ఇది అనుమతిస్తుంది.

5. మొబైల్ ఇన్సూరెన్స్ : ఇది పర్ఛేజ్ ప్రొటెక్షన్​ను పోలి ఉంటుంది. క్రెడిట్​ కార్డును ఉపయోగించి కొన్న మొబైల్ ఫోన్​ డ్యామేజ్​ అయినా లేదా దొంగతనానికి గురైనా సరే ఆ నష్టాన్ని కవర్ చేస్తుంది.

6. ఫ్రాడ్ ప్రొటెక్షన్ : క్రెడిట్​ కార్డు ద్వారా ఏదైనా మోసం జరిగినప్పుడు వినియోగదారుడిపై ఎటువంటి భారం పడకుండా ఆ నగదును ఈ బీమా చెల్లిస్తుంది. అయితే ఈ ఇన్సూరెన్స్​కు కార్డును ఇష్యూ చేసిన సంస్థలు కొన్ని షరుతులను విధించవచ్చు.

7. క్రెడిట్ షీల్డ్ ఇన్సూరెన్స్ : కార్డు హోల్డర్​ చనిపోతే ఇప్పటికే ఉన్న రుణాన్ని తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. అయితే ముందుగా నిర్ణయించిన పరిమితి మేరకు మాత్రమే క్రెడిట్ వాడుకుంటే, దానిని ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

8.యాక్సిడెంట్ కవర్ : కొన్ని క్రెడిట్ కార్డులు వినియోగదారులకు రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షల వరకు అదనపు ప్రమాద బీమా కవరేజీని అందిస్తాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.