How to Reactivate Frozen NPS Account: వేతన జీవులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే.. జాతీయ పింఛను పథకం(National Pension Scheme). సాధారణ పౌరులకు కూడా ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో మంచి రాబడిని అందుకోవచ్చు. అయితే.. కొన్ని కారణాల వల్ల NPS అకౌంట్ డీయాక్టివేట్ కావొచ్చు. మరి తిరిగి యాక్టివేట్ ఎలా చేసుకోవాలి అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎన్పీఎస్ ఖాతా రెండు రకాలుగా ఉంటుంది. అవి..
ఎన్పీఎస్ టయర్-1: ఇది ప్రాథమిక పదవీ విరమణ ఖాతా. పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. సాధారణంగా ఎన్పీఎస్ అకౌంట్ అంటే రూ.లక్షన్నర వరకు బెనిఫిట్స్ ఉంటాయి. ఈ అకౌంట్ తీసుకుంటే మాత్రం.. అదనంగా మరో రూ. 50వేల వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. విత్‌డ్రా సమయంలో నిబంధనలు ఉంటాయి.
ఎన్పీఎస్ టయర్- 2 అకౌంట్:-ఇది ఆప్షనల్ రిటైర్మెంట్/ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. టయర్ 1 అకౌంట్ ఉన్న ఎన్పీఎస్ సబ్స్క్రైబర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఇందులో.. ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్సూ ఉండవు. విత్‌డ్రాకు నిబంధనలూ ఉండవు. స్వచ్ఛందంగా పొదుపు చేయాలనుకునే వ్యక్తులకు టైర్-2 అనువైనది.
ఎన్పీఎస్ అకౌంట్ డీయాక్టివేట్ కావడానికి కారణాలు:
- వార్షిక ప్రీమియం చెల్లించడంలో విఫలమైతే NPS ఖాతా డీయాక్టివేట్ అవుతుంది.
- KYC డాక్యుమెంటేషన్ సరిగా లేకున్నా ఖాతా డీయాక్టివేట్ అవ్వొచ్చు.
- ఇంకా ఏవైనా నిబంధనలు పాటించకపోతే కూడా ఖాతా డీయాక్టివేట్ కావొచ్చు
NPS ఖాతాదారులకు గుడ్ న్యూస్ - డబ్బు విత్‌డ్రా రూల్స్ మారాయ్!
NPS అకౌంట్‌ను రీయాక్టివేట్ చేయడం ఎలా:అకౌంట్ తిరిగి యాక్టివేట్ చేయాలంటే.. అసలు డీయాక్టివేట్ అవ్వడానికి కారణం ఏంటో కచ్చితంగా తెలుసుకోవాలి. అందుకోసం eNPS ద్వారా ఆన్లైన్లో లేదా పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్(PoP) వద్ద ఆఫ్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఖాతాను రీయాక్టివేట్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఇందుకోసం..
- అప్లికేషన్: అకౌంట్‌ను రీయాక్టివేట్ చేసుకోవడం కోసం తప్పనిసరిగా UOS-S10-A అప్లికేషన్ పూర్తి చేయాలి. ఈ ఫారమ్‌ను పోస్టాఫీసు నుంచి లేదంటే మీ అకౌంట్ ఉన్న బ్యాంకు నుంచి కూడా పొందవచ్చు. ఫారమ్ నింపిన తర్వాత మీకు ఎన్‌పిఎస్ ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీస్‌లో ఇవ్వాలి.
- డాక్యుమెంట్స్:మీరు పోస్టాఫీసు లేదా బ్యాంకుకు సమర్పించబోయే ఫారంతోపాటు PRAN కార్డు కాపీని అటాచ్ చేయాలి. మీ NPS ఖాతాను రీయాక్టివేట్ చేయడానికి PRAN కార్డ్ అవసరం. ఎన్‌పిఎస్ ఖాతా డీయాక్టివేట్ అయితే.. ఈ కార్డు కూడా స్తంభించిపోతుంది. రీయాక్టివేట్ తరువాత ఇవి రెండూ యాక్టివేట్ అవుతాయి.
- పెనాల్టీ ఎంత?: ఎన్‌పిఎస్ ఖాతాను యాక్టివేట్ చేయడానికి కొంత మొత్తాన్ని జమ చేయాలి. సాధారణ ఎన్‌పిఎస్ ఖాతాకు కనీస డిపాజిట్ మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఖాతా యాక్టివేట్ అవుతుంది. ఖాతా నాలుగేళ్లపాటు ఫ్రీజ్ అయితే అదనంగా రూ.100 చెల్లించాలి.
- ఖాతా రీయాక్టివేట్ చేసుకోవడానికి దరఖాస్తును బ్యాంక్ లేదా పోస్టాఫీసులో దరఖాస్తు సమర్పించాలి. ఆ తర్వాత NPS అధికారులు మీ ఖాతాను పరిశీలించి.. ప్రాసెస్ చేస్తారు. అనంతరం ఖాతా రీయాక్టివేట్ అవుతుంది. ఇందుకోసం సుమారు వారం రోజులు పడుతుంది.
నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో కొత్త రూల్ - ఈ విషయం మీకు తెలుసా?
NPS Pension Scheme Get Returns 1 Lakh per Month : రిటైర్మెంట్ తర్వాత నెలకు లక్ష రూపాయల పెన్షన్.. ఈ పథకం తెలుసా..?