తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ మాయమాటలు నమ్మారో - మీ బ్యాంక్​ ఖాతా ఖాళీ కావడం గ్యారెంటీ! - How To Protect From Bank Fraud - HOW TO PROTECT FROM BANK FRAUD

How To Protect Yourself From Bank Fraud : నేడు ఆన్​లైన్ బ్యాంకింగ్ మోసాలు, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ ఫ్రాడ్స్​ రోజుకో కొత్త విధానంలో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. అందుకే ఇలాంటి బ్యాంకింగ్ మోసాల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Protect Yourself from Cyber Fraud
How to Protect Yourself from Bank Fraud (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 12:57 PM IST

How To Protect Yourself From Bank Fraud : బ్యాంకులు ఎప్పుడూ ఖాతాదారులకు నేరుగా ఫోన్ చేయవు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అయితే చాలా మంది బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది అనగానే కంగారు పడుతుంటారు. వాళ్లు అడిగిన వివరాలను వెంటనే చెప్పేస్తుంటారు. కానీ ఎప్పుడూ ఇలాంటి పనులు చేయకూడదు. మీ మొబైల్​కు వచ్చే ఓటీపీలను ఎవరికీ చెప్పకూడదు. సైబర్ నేరగాళ్లు పంపించే మోసపూరితమైన లింక్​లను కూడా ఎప్పుడూ క్లిక్ చేయకూడదు.

ఏపీకే ఫైల్ స్కామ్స్​
How To Avoid APK File Scams :సైబర్ నేరగాళ్లు యూజర్లఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకొని, అందులోని మొత్తం సమాచారాన్ని తెలుసుకొని, బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఇది ఎలా చేస్తున్నారంటే, ముందుగా ఏపీకే ఫైల్స్​ (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ)ను యూజర్లకు పంపిస్తారు. పొరపాటున వాటిపై క్లిక్ చేయగానే, అవి ఫోన్లో ఇన్​స్టాల్ అయిపోతాయి. అక్కడి నుంచి మీ ఫోన్ హ్యాకర్ల కంట్రోల్​లోకి వెళ్లిపోతుంది. అందుకే ఈ ఏపీకే మోసాలపై అప్రమత్తంగా ఉండాలంటే ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్​ లాంటి పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు సూచనలు జారీ చేశాయి. ముఖ్యంగా కేవైసీ అప్​డేట్, రివార్డు పాయింట్స్​ వంటి వాటిపేరుతో పంపిస్తున్న ఏపీకే ఫైల్స్​ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాయి. బ్యాంకులు ఇలాంటి లింక్​లు ఉన్న మెసేజ్​లను ఎప్పుడూ పంపించవని స్పష్టం చేస్తున్నాయి.

వీటిని ఎలా గుర్తించాలి:
మీ మొబైల్ ఫోన్​కు వచ్చిన మెసేజ్​లో ఏవైనా ఏపీకే ఫైల్స్ ఉంటే, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్​స్టాల్ చేయకూడదు. ఇది కేవలం కొన్ని కేబీల్లోనే ఉంటుంది. ఫోన్​లో ఇన్​స్టాల్ చేసిన వెంటనే, మీ ఫోన్​లోని నంబర్లు, యాప్స్, కెమెరాలాంటివన్నీ ఉపయోగించుకునేందుకు పర్మిషన్ అడుగుతుంది. వీటిని బట్టి అది మోసమని మీరు అర్థంచేసుకోవాలి. కేవలం గూగుల్​ప్లే స్టోర్ లాంటి అధికారిక స్టోర్ల నుంచి మాత్రమే యాప్స్​ డౌన్​లోడ్ చేసుకోవాలి.

మెసేజ్​లతో జాగ్రత్త:
బ్యాంకుల నుంచి పలు స్కీమ్​లు, బీమా ఉత్పత్తులకు సంబంధించిన సమాచారంతో మెసేజ్​లు వస్తుంటాయి. అవి నిజమే అనుకుని ఆ లింకులపై క్లిక్ చేస్తే, మన పర్సనల్ డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులు తమ కస్టమర్లకు సూచిస్తున్నాయి. మీకు ఏదైనా సమాచారం కావాలంటే, నేరుగా బ్యాంకును సంప్రదించాలని స్పష్టం చేస్తున్నాయి.

ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దు!
బ్యాంకు నుంచి వచ్చిన ఓటీపీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని యాక్సెస్ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ కస్టమర్లకు సూచించాయి. ఖాతాదారులు ఏవైనా లావాదేవీలు చేసినప్పుడు మాత్రమే ఓటీపీలు వస్తాయని, దాన్ని ఎంటర్ చేస్తే ఆ లావాదేవీ పూర్తవుతుందని పేర్కొన్నాయి. అందుకే ఎలాంటి ఆన్​లైన్ లావాదేవీలు చేయకుండా, మీకు ఓటీపీ వచ్చిందంటే, దానిని కచ్చితంగా అనుమానించాలి.

క్విషింగ్
ఈ క్విషింగ్ అనేది కొత్త రకం మోసం. ఖాతాదారుల ఫోన్​కు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. దీనిలో మోసపూరిత వెబ్​సైట్ లింక్స్ ఉంటాయి. క్యూఆర్ కోడ్స్​లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయగానే ఈ వెబ్​సైట్ ఓపెన్ అవుతుంది. మన సమాచారం మొత్తం ఆరా తీస్తుంది. చూసేందుకు అచ్చం బ్యాంకు వెబ్​సైట్ల మాదిరిగానే ఉంటుంది. కొన్నిసార్లు క్యూఆర్ కోడ్​ను ఓపెన్ చేసిన వెంటనే డబ్బులు పంపించేందుకు పిన్​ను ఎంటర్ చేయాలని అడుగుతాయి. పొరపాటున పిన్ ఎంటర్ చేశామా, ఇక అంతే, మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బులు మొత్తం ఖాళీ చేస్తారు. తర్వాత ఎంత బాధపడినా లాభం ఉండదు.

లార్జ్​ క్యాప్ Vs మిడ్​ క్యాప్ Vs స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​! - Different Mutual Funds

నో స్కిడ్డింగ్, టైర్లకు ఫుల్ గ్రిప్- ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్​తో టాప్​-5 కార్స్ ఇవే- బడ్జెట్ రూ.10లక్షలే! - Cars With Traction Control

ABOUT THE AUTHOR

...view details